Telugu Global
Cinema & Entertainment

'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమా రివ్యూ

రివ్యూ : తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ రేటింగ్ : 1.5/5 తారాగణం : సందీప్ కిషన్, హన్సిక మోత్వాని, వరలక్ష్మి శరత్ కుమార్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, అయ్యప్ప శర్మ, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, అన్నపూర్ణ తదితరులు సంగీతం: సాయి కార్తీక్ నిర్మాత : పి నాగ భూషణ్ రెడ్డి, సంజీవ రెడ్డి, రూప జగదీష్, శ్రీనివాస్ ఇందుమూరి దర్శకత్వం : జి. నాగేశ్వర రెడ్డి వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న […]

తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమా రివ్యూ
X

రివ్యూ : తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్
రేటింగ్ : 1.5/5
తారాగణం : సందీప్ కిషన్, హన్సిక మోత్వాని, వరలక్ష్మి శరత్ కుమార్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, అయ్యప్ప శర్మ, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, అన్నపూర్ణ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
నిర్మాత : పి నాగ భూషణ్ రెడ్డి, సంజీవ రెడ్డి, రూప జగదీష్, శ్రీనివాస్ ఇందుమూరి

దర్శకత్వం : జి. నాగేశ్వర రెడ్డి

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న యువ హీరో సందీప్ కిషన్ ఈ మధ్యనే విడుదలైన ‘నిను వీడని నీడను నేనే’ సినిమా తో పర్వాలేదు అనిపించాడు. తాజాగా జి.నాగేశ్వరరావు దర్శకత్వంలో ‘తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్’ సినిమాతో మన ముందుకు వచ్చాడు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది మిల్కీ బ్యూటీ హన్సిక మొత్వాని. కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈరోజు ఈ సినిమా మంచి అంచనాల మధ్యన విడుదల అయ్యింది.

తెనాలి రామకృష్ణ (సందీప్ కిషన్) ఒక చిన్న లాయర్. తనవద్దకు వచ్చేవారికి బోలెడు ఆఫర్ లు ఇస్తూ కేసులు చేపడుతూ ఉంటాడు. ఎప్పటికైనా ఏదో ఒక పెద్ద కేసు డీల్ చేయాలని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు.

మరోవైపు వరలక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) ఒక పెద్ద బిలినియర్. తన శత్రువు వల్ల ఒక మర్డర్ కేసులో ఈమె పై తప్పుడు ఆరోపణల తో కేసు నమోదు అవుతుంది. తెనాలి రామకృష్ణ కి ఈ కేస్ దొరుకుతుంది. తెనాలి ఈ కేస్ ని ఎలా డీల్ చేశాడు? తెనాలి రామకృష్ణ మరియు రుక్మిణి (హన్సిక) మధ్య ప్రేమ కథ ఎలా మొదలైంది? ఈ కేసు వల్ల తెనాలి రామకృష్ణ జీవితం ఎలా మారింది? చివరికి ఏమైంది? అనేది ఈ సినిమా కథ.

సందీప్ కిషన్ తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడని చెప్పుకోవాలి. ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో సందీప్ కిషన్ కి మంచి పాత్రే దక్కింది.

ఎప్పటిలాగానే హన్సిక మొత్వాని తన అందంతో మాత్రమే కాక నటనతో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇక సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర మరియు నటన హైలైట్ అని చెప్పుకోవచ్చు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది.

మురళి శర్మ తన పాత్రకి న్యాయం చేశారు. అన్నపూర్ణ తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. వెన్నెల కిషోర్, అయ్యప్ప శర్మ పాత్రలు చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. రఘు బాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు బాగా నవ్వు తెప్పిస్తుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

ఈ సినిమా కోసం దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఒక మంచి కథను ఎంచుకున్నారు… కానీ దానిని ప్రెజెంట్ చేసే విషయంలో మాత్రం అంతగా మెప్పించలేదనే చెప్పుకోవాలి. కథ కొంచెం స్లోగా సాగడంతో ప్రేక్షకులు కూడా సినిమా తో కనెక్ట్ అవ్వలేక పోతారు. అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలతో బాగానే నవ్వించారు… కానీ తన నెరేషన్ తో మాత్రం జి.నాగేశ్వరరెడ్డి ఏ మాత్రం ఆకట్టుకోలేదు అని చెప్పుకోవాలి.

ఎస్ ఎన్ ఎస్ క్రియేషన్స్ వారు అందించిన నిర్మాణ విలువలు సినిమాకి ప్లస్ అయ్యాయి. సాయి కార్తీక్ అందించిన సంగీతం బాగుంది. పాటలు యావరేజ్ గా ఉన్నప్పటికీ తన నేపధ్య సంగీతం తో సాయికార్తీక్ చాలా బాగా ఆకట్టుకున్నాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అతని కెమెరా యాంగిల్స్ మరియు విజువల్స్ సినిమాకి బలాన్ని చేకూర్చాయి. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

నటీనటులు, నేపధ్య సంగీతం, కామెడీ

బలహీనతలు:

నెరేషన్, సాగతీత సన్నివేశాలు

చివరి మాట:

సినిమా గురించి మాట్లాడుకునే ముందు కథ గురించి చెప్పుకోవాలి. సినిమాకి మంచి కథ ఉన్నప్పటికీ ఈ దర్శకుడు దానిని హ్యాండిల్ చేసే విధానంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవాలి. కామెడీ సన్నివేశాలు కొంత వరకు బాగానే ఉన్నప్పటికీ అనవసరమైన సన్నివేశాలతో కథను డ్రాగ్ చేస్తూ ముందుకు తీసుకు వెళ్ళాడు దర్శకుడు. చాలావరకు కామెడీ సన్నివేశాలు కూడా అవుట్ డేటెడ్ గా అనిపించడంతో ప్రేక్షకులు సినిమా తో ఏ మాత్రం కనెక్ట్ కాలేకపోయారు.

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఇలాంటి రొటీన్ కామెడీ సన్నివేశాలతో సాగిపోతుంది. మొదటి భాగం తో పోల్చుకుంటే సినిమాలోని రెండో భాగం పర్వాలేదు అనిపిస్తుంది.

బాటమ్ లైన్: ‘తెనాలి రామ కృష్ణ బీఏ బీఎల్’ గా సందీప్ కిషన్ అనుకున్నంత స్థాయిలో అలరించలేదు.

First Published:  15 Nov 2019 6:05 AM GMT
Next Story