Telugu Global
NEWS

ఇంగ్లీష్ రాకే అచ్చెన్నాయుడు విజయవాడ వీధుల్లో తిరుగుతున్నాడు...

ఇంగ్లీష్‌ రాకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని చూసి కూడా తెలుసుకోవచ్చన్నారు మంత్రి కొడాలి నాని. ప్రతిపక్ష పార్టీల నేతలు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ పేద విద్యార్థులకు మాత్రం నీతులు చెబుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఏ రంగంలో రాణించాలన్నా ఇంగ్లీష్ అవసరమన్న విషయం ఈ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పార్టనర్ పవన్‌ కల్యాణ్‌ కూడా ఇటీవల ఇంగ్లీష్ విషయంలో ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారని… ఇదే పవన్‌ కల్యాణ్ చదవుకున్నది […]

ఇంగ్లీష్ రాకే అచ్చెన్నాయుడు విజయవాడ వీధుల్లో తిరుగుతున్నాడు...
X

ఇంగ్లీష్‌ రాకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని చూసి కూడా తెలుసుకోవచ్చన్నారు మంత్రి కొడాలి నాని. ప్రతిపక్ష పార్టీల నేతలు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ పేద విద్యార్థులకు మాత్రం నీతులు చెబుతున్నారని విమర్శించారు.

ప్రస్తుతం ఏ రంగంలో రాణించాలన్నా ఇంగ్లీష్ అవసరమన్న విషయం ఈ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పార్టనర్ పవన్‌ కల్యాణ్‌ కూడా ఇటీవల ఇంగ్లీష్ విషయంలో ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారని… ఇదే పవన్‌ కల్యాణ్ చదవుకున్నది ఇంగ్లీష్ మీడియంలో కాదా? ఆయన పిల్లలు చదువుతున్నది ఇంగ్లీష్ మీడియంలో కాదా? అని ప్రశ్నించారు.

ఎర్రన్నాయుడు, రామ్మోహన్ నాయుడికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టే వారు ఢిల్లీకి వెళ్లి రాజకీయం చేయగలిగారని… అచ్చెన్నాయుడుకు ఇంగ్లీష్‌ రాదు కాబట్టే విజయవాడ వీధుల్లో తిరుగుతున్నారని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

తెలుగు భాషను నిర్లక్ష్యం చేసే అవకాశమే లేదని… తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేశామని మంత్రి వివరించారు. రాష్ట్రంలోని 45వేల పాఠశాల రూపురేఖలు మార్చేందుకు 33వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కొడాలి నాని వివరించారు.

First Published:  15 Nov 2019 12:30 AM GMT
Next Story