Telugu Global
NEWS

పాక్ తో డేవిస్ కప్ సమరానికి లియాండర్ పేస్

ఏడాది తర్వాత భారతజట్టులో పేస్ పాకిస్థాన్ తో ఇస్లామాబాద్ వేదికగా ఈనెలలో జరిగే డేవిస్ కప్ పోరులో పాల్గొనే 8మంది సభ్యుల భారతజట్టును భారత టెన్నిస్ సంఘం ప్రకటించింది. ఆసియా-ఓషియానా జోన్ పోటీలలో భాగంగా ఇస్లామాబాద్ వేదికగా నవంబర్ 29, 30 తేదీలలో జరిగే పోటీలో పాల్గొనే భారతజట్టులో… వెటరన్ లియాండర్ పేస్ తో సహా స్టార్ ప్లేయర్లు సుమిత్ నగాల్, రామ్ కుమార్, రోహన్ బొప్పన్నలకు చోటు దక్కింది. పాక్ వేదికగా లేదా…తటస్థ వేదికగా మ్యాచ్ […]

పాక్ తో డేవిస్ కప్ సమరానికి లియాండర్ పేస్
X
  • ఏడాది తర్వాత భారతజట్టులో పేస్

పాకిస్థాన్ తో ఇస్లామాబాద్ వేదికగా ఈనెలలో జరిగే డేవిస్ కప్ పోరులో పాల్గొనే 8మంది సభ్యుల భారతజట్టును భారత టెన్నిస్ సంఘం ప్రకటించింది.

ఆసియా-ఓషియానా జోన్ పోటీలలో భాగంగా ఇస్లామాబాద్ వేదికగా నవంబర్ 29, 30 తేదీలలో జరిగే పోటీలో పాల్గొనే భారతజట్టులో… వెటరన్ లియాండర్ పేస్ తో సహా స్టార్ ప్లేయర్లు సుమిత్ నగాల్, రామ్ కుమార్, రోహన్ బొప్పన్నలకు చోటు దక్కింది.

పాక్ వేదికగా లేదా…తటస్థ వేదికగా మ్యాచ్ జరిగినా పాల్గొనటానికి వీలుగా ఎనిమిదిమంది సభ్యుల జట్టును ఖరారు చేసింది. ఉగ్రవాదుల అడ్డా పాక్ వేదికగా జరిగే ఈ పోటీలో భద్రతా కారణాలతో తాము పాల్గొనేది లేదని నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతితో సహా పలువురు ప్రధాన ఆటగాళ్లు గతంలోనే ప్రకటించడంతో.. జట్టులో మార్పులు చేర్పులు చేపట్టారు.
వాస్తవానికి డేవిస్ కప్ లో ఐదుగురు సభ్యులు మాత్రమే ఉంటారు.

అయితే… ప్రస్తుత ప్రత్యేక పరిస్థితిలో మాత్రం ఎనిమిదిమంది సభ్యుల జట్టును ఎంపిక చేయాల్సి వచ్చిందని శిక్షకుడు జీషన్ అలీ ప్రకటించారు. జీవన్ నెడుంజెళియన్, సాకేత్ మైనేని, సిద్ధార్ధ రావత్ సైతం జట్టులో సభ్యులుగా ఉన్నారు.

రోహిత్ రాజ్ పాల్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా ఉన్న భారతజట్టులో 127వ ర్యాంకర్ సుమిత్ నగాల్, 190వ ర్యాంకర్ రామ్ కుమార్, 250వ ర్యాంకర్ ముకుంద్, 267వ ర్యాంకర్ సాకేతి మైనేని సింగిల్స్ లోనూ, రోహన్ బొపన్న, లియాండర్ పేస్ డబుల్స్ లోను పాల్గోనున్నారు.

2018లో చైనాతో జరిగిన డేవిస్ కప్ సమరంలో చివరిసారిగా పాల్గొన్న 46 ఏళ్ల పేస్ చివరకు ఏడాది విరామం తర్వాత కానీ తిరిగి భారతజట్టులో చోటు సంపాదించలేక పోయాడు.

First Published:  15 Nov 2019 12:28 AM GMT
Next Story