Telugu Global
NEWS

ఇంగ్లీష్ మీడియంను ఆహ్వానిస్తున్నాం...

ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలన్న జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీ సంఘం నేత ఆర్‌ కృష్ణయ్య స్వాగతించారు. జగన్‌ నిర్ణయాన్ని అన్ని వర్గాల వారు స్వాగతించాలన్నారు. ప్రస్తుత కాలంలో ఏ చిన్న ఉద్యోగం కావాలన్నా ఇంగ్లీష్ తప్పనిసరి అయిపోయిందని… కాబట్టి ఇంగ్లీష్ మీడియం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. జగన్‌ నిర్ణయం వల్ల పేద విద్యార్థులకు, వెనుక బడిన వర్గాల పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వారి భవిష్యత్తుకు జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం బంగారు బాట […]

ఇంగ్లీష్ మీడియంను ఆహ్వానిస్తున్నాం...
X

ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలన్న జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీ సంఘం నేత ఆర్‌ కృష్ణయ్య స్వాగతించారు. జగన్‌ నిర్ణయాన్ని అన్ని వర్గాల వారు స్వాగతించాలన్నారు.

ప్రస్తుత కాలంలో ఏ చిన్న ఉద్యోగం కావాలన్నా ఇంగ్లీష్ తప్పనిసరి అయిపోయిందని… కాబట్టి ఇంగ్లీష్ మీడియం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. జగన్‌ నిర్ణయం వల్ల పేద విద్యార్థులకు, వెనుక బడిన వర్గాల పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వారి భవిష్యత్తుకు జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం బంగారు బాట వేస్తుందన్నారు.

పిల్లల భవిష్యత్తు మీద ఆశతో కూలీ పనులు చేసుకునేవారు కూడా అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపుతున్నారని ఆర్‌ కృష్ణయ్య చెప్పారు. దాంతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు.

ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినంత మాత్రాన మాతృభాష తెలుగు ఎక్కడికీ పోదన్నారు. సీఎం జగన్‌ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత ఇంతకు ముందు ఉన్న ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదని ప్రశంసించారు.

First Published:  13 Nov 2019 11:57 PM GMT
Next Story