Telugu Global
NEWS

లోకేష్‌ను పట్టించుకోని నరేంద్ర.... పొన్నూరులో హాట్‌హాట్‌ పాలిటిక్స్‌ !

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటించారు. అయితే ఆయన టూర్‌కు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర దూరంగా ఉన్నారు. లోకేష్‌ టూర్‌కు ఆయన ఎందుకు రాలేదనేది ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. పొన్నూరు నుంచి దూళిపాళ్ల నరేంద్ర ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి కొంత సైలెంట్‌గా ఉంటున్నారు. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పొన్నూరులో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు రవి కుటుంబసభ్యులను టీడీపీ జాతీయ […]

లోకేష్‌ను పట్టించుకోని నరేంద్ర.... పొన్నూరులో హాట్‌హాట్‌ పాలిటిక్స్‌ !
X

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటించారు. అయితే ఆయన టూర్‌కు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర దూరంగా ఉన్నారు. లోకేష్‌ టూర్‌కు ఆయన ఎందుకు రాలేదనేది ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

పొన్నూరు నుంచి దూళిపాళ్ల నరేంద్ర ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి కొంత సైలెంట్‌గా ఉంటున్నారు. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

పొన్నూరులో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు రవి కుటుంబసభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరామర్శించారు. లోకేష్‌తో పాటు గుంటూరు జిల్లా కీలక నేతలు వచ్చారు. తన నియోజకవర్గానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ వస్తే… దూళిపాళ్ల నరేంద్ర పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.

దూళిపాళ్ల నరేంద్ర పది రోజుల కిందటనే అయ్యప్ప మాల వేసుకున్నారట. దీంతో పోగ్రామ్‌కు రాలేదని గుంటూరు టీడీపీ నేతలు కొందరు క్లారిటీ ఇచ్చారు. అయితే నారాలోకేష్‌తో దూళిపాళ్ల నరేంద్రకు గ్యాప్‌ ఉందనేది ఆఫ్‌ ది రికార్డుగా వినిపిస్తున్న మాట.

గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఆలపాటి రాజాతో పాటు దూళిపాళ్ల నరేంద్ర ట్రై చేస్తున్నారట. వీరి మధ్య అధ్యక్ష పదవి కోసం తెగ పోటీ నడుస్తుందట. తన నియోజకవర్గంలోకి లోకేష్‌ను ఆలపాటి రాజా తీసుకువస్తున్నారని భావించిన దూళిపాళ్ల ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారని ప్రచారం జరుగుతోంది. ఆలపాటికి, నరేంద్రకు మొదటి నుంచి జిల్లాలో వర్గ పోరు నడుస్తోందట.

First Published:  14 Nov 2019 12:33 AM GMT
Next Story