Telugu Global
NEWS

రోజుకు 2లక్షల టన్నుల ఇసుక సరఫరా " వైఎస్ జగన్

వారంలోగా రోజుకు ఇసుక సరఫరా సామర్థ్యాన్ని రెండు లక్షల టన్నులకు పెంచాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి… నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో ఇసుక డిమాండ్‌ రోజుకు సరాసరి 80వేల టన్నుల వరకు ఉండేదన్నారు. వరదల కారణంగా రీచ్‌లు మునిగిపోయి టార్గెట్‌ను అందుకోలేక పోయామని సీఎం అభిప్రాయపడ్డారు. గత వారం రోజులుగా పరిస్థితి మెరుగుపడిందన్నారు. ప్రస్తుతం ఇసుక సరఫరా రోజుకు […]

రోజుకు 2లక్షల టన్నుల ఇసుక సరఫరా  వైఎస్ జగన్
X

వారంలోగా రోజుకు ఇసుక సరఫరా సామర్థ్యాన్ని రెండు లక్షల టన్నులకు పెంచాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి… నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో ఇసుక డిమాండ్‌ రోజుకు సరాసరి 80వేల టన్నుల వరకు ఉండేదన్నారు.

వరదల కారణంగా రీచ్‌లు మునిగిపోయి టార్గెట్‌ను అందుకోలేక పోయామని సీఎం అభిప్రాయపడ్డారు. గత వారం రోజులుగా పరిస్థితి మెరుగుపడిందన్నారు. ప్రస్తుతం ఇసుక సరఫరా రోజుకు సరాసరి లక్షా 20వేల టన్నులకు చేరిందని వివరించారు. ప్రస్తుతం 90 రీచ్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు. రోజువారి ఇసుక సరఫరా వచ్చే వారం రోజుల్లో లక్షా 20వేల నుంచి రెండు లక్షల టన్నులకు పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలా చేయడం వల్ల డిమాండ్ ను అధిగమించడంతో పాటు మిగులు నిల్వలను స్టాక్ పాయింట్లలో ఉంచేందుకు వీలవుతుందన్నారు.

ఇసుక వారోత్సవాలు ముగిసే నాటికి ఇసుక పాయింట్లను 137 నుంచి 180కి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నియోజకవర్గాల వారీగా ధరల పట్టికను ప్రకటించాలన్నారు. ఈ ధరలపై జిల్లాల వారీగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఇసుక కొరత తీరే వరకు సంబంధిత అధికారులు సెలవులు తీసుకోవద్దని సీఎం సూచించారు.

సరిహద్దుల్లో చెక్‌పోస్టులను బలోపేతం చేయాలని… పెద్ద దారులతో పాటు… చిన్న రహదారుల్లోనూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 10 రోజుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి చెక్‌పోస్టువద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సూచించారు.

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమంగా ఇసుక రవాణా చేసే వారికి జైలు శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం చెప్పారు.

First Published:  12 Nov 2019 3:51 AM GMT
Next Story