Telugu Global
International

కొడంగల్ లో ఓడుతానని... మల్కాజిగిరిలో గెలుస్తానని... అనుకోలేదు

రేవంత్ రెడ్డి.. ఫైర్ బ్రాండ్ గా రాజకీయాల్లో వెలిగిన ఈయన కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చి ఫేమస్ అయ్యాడు. టీడీపీలో అత్యున్నత పదవులు అనుభవించిన రేవంత్.. తెలంగాణలో ఆ పార్టీ పని అయిపోవడంతో కాంగ్రెస్ లో చేరారు. అయితే రేవంత్ ను ఆయన సొంత ఇలాఖా కొడంగల్ లో ఓడించి కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఇంట ఓడి రచ్చ గెలిచాడు. అదే విచిత్రం. మల్కాజిగిరి ఎంపీగా పోటీచేసి అనూహ్యంగా […]

కొడంగల్ లో ఓడుతానని... మల్కాజిగిరిలో గెలుస్తానని... అనుకోలేదు
X

రేవంత్ రెడ్డి.. ఫైర్ బ్రాండ్ గా రాజకీయాల్లో వెలిగిన ఈయన కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చి ఫేమస్ అయ్యాడు. టీడీపీలో అత్యున్నత పదవులు అనుభవించిన రేవంత్.. తెలంగాణలో ఆ పార్టీ పని అయిపోవడంతో కాంగ్రెస్ లో చేరారు. అయితే రేవంత్ ను ఆయన సొంత ఇలాఖా కొడంగల్ లో ఓడించి కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకున్నారు.

కానీ రేవంత్ రెడ్డి ఇంట ఓడి రచ్చ గెలిచాడు. అదే విచిత్రం. మల్కాజిగిరి ఎంపీగా పోటీచేసి అనూహ్యంగా రేవంత్ రెడ్డి పార్లమెంట్ గడప తొక్కాడు. తాజాగా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలోని న్యూజెర్సీలో ఎన్ఆర్ఐలు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కొడంగల్ అసెంబ్లీ స్థానంలో తాను ఓడిపోతాను అని కానీ.. మల్కాజిగిరి ఎంపీగా తాను గెలుస్తానని కానీ ఊహించలేదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. కేసీఆర్ పాలనే బాగుంటే నిజామాబాద్ ఎంపీగా కేసీఆర్ కూతురు కవిత ఎందుకు ఓడిపోయిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

సమయం.. సందర్భానుసారం ప్రకృతి, కాలం స్పందిస్తుందని.. అలాంటి అద్భుతాలే మొన్నటి ఎన్నికల ఫలితాలుగా వచ్చాయని రేవంత్ రెడ్డి వేదాంతం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రాణాలు ఫణంగా పెట్టిన కుటుంబాలకు న్యాయం జరగలేదని రేవంత్ వాపోయారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.

Next Story