Telugu Global
National

ఆధారాలు దొరికితేనే ఏం కాలేదు... ఈ 150 కోట్లు ఒక లెక్కా?

ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఒక ముఖ్య వ్యక్తికి దక్షిణ భారతదేశానికి చెందిన సంస్థ నుంచి రూ.150 కోట్లకు పైగా నగదు చెల్లింపులు జరిగినట్లు మా సోదాల్లో ఆధారాలు లభించాయని ఆదాయ పన్ను శాఖ కమిషనర్‌ సురభి అహ్లూవాలియా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్‌, పూణే, ఆగ్రా, గోవా లలో జరిగిన ఐటీ దాడులలో…. కొన్ని సంస్థలు 3,300 కోట్ల నిధులను దారి మళ్ళించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇందులో 150 కోట్ల […]

ఆధారాలు దొరికితేనే ఏం కాలేదు... ఈ 150 కోట్లు ఒక లెక్కా?
X

ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఒక ముఖ్య వ్యక్తికి దక్షిణ భారతదేశానికి చెందిన సంస్థ నుంచి రూ.150 కోట్లకు పైగా నగదు చెల్లింపులు జరిగినట్లు మా సోదాల్లో ఆధారాలు లభించాయని ఆదాయ పన్ను శాఖ కమిషనర్‌ సురభి అహ్లూవాలియా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇటీవల ఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్‌, పూణే, ఆగ్రా, గోవా లలో జరిగిన ఐటీ దాడులలో…. కొన్ని సంస్థలు 3,300 కోట్ల నిధులను దారి మళ్ళించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు.

ఇందులో 150 కోట్ల మొత్తం ఒక రాజకీయ పార్టీ అధినేతకు అందినట్లు ఐటీ శాఖకు స్పష్టమైన ఆధారాలు లభించాయి.

అన్ని ముఖ్యమైన వ్యవస్థలలోనూ తన మనుషులను ఎంతో ముందస్తుగా చొప్పించిన ఆ నేతకు ఈ 150 కోట్ల సమాచారం కూడా తన మనుషుల ద్వారా ముందస్తుగానే అందినట్లు తెలిసింది.

దాంతో రంగంలోకి దిగిన నేత అన్ని వ్యవస్థలలోనూ ఉన్న తన మనుషుల ద్వారా తన పేరు బయటకు రాకుండా ఉండడానికి సర్వ ప్రయత్నాలూ చేస్తున్నట్లు సమాచారం.

అయితే పార్టీలోని ముఖ్యనేతలు మాత్రం చాలా ధీమాగా మాట్లాడుతున్నారు. వేల కోట్ల రూపాయల స్కామ్‌లే మా నాయకుడిని కోర్టు బోను కూడా ఎక్కించలేక పోయాయి. ఆధారాలు దొరికితేనే ఏం కాలేదు… ఈ 150 కోట్లు మాకు ఒక లెక్కా? అంటూ ధైర్యంగా ఉండడం విశేషం.

First Published:  12 Nov 2019 12:59 AM GMT
Next Story