Telugu Global
NEWS

మేరీకోమ్ కు తెలంగాణ బాక్సర్ సవాల్

డిసెంబర్ లో మేరీతో నిఖత్ జరీన్ పైట్ టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ మహిళల 51 కిలోల విభాగంలో…భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ పాల్గొనటానికి ముందే…అర్హత పోటీలలో తెలంగాణా యువబాక్సర్ నిఖత్ జరీన్ తో తలపడటానికి రంగం సిద్ధమయ్యింది. గతంలో 48 కిలోల విభాగంలో ఆరు ప్రపంచ టైటిల్స్ తో పాటు బంగారు పతకాలు సైతం సాధించిన మేరీ కోమ్…ఒలింపిక్స్ లో మాత్రం 51 కిలోల విభాగంలో పోటీకి దిగాలని నిర్ణయించింది. భారత బాక్సింగ్ సంఘం […]

మేరీకోమ్ కు తెలంగాణ బాక్సర్ సవాల్
X
  • డిసెంబర్ లో మేరీతో నిఖత్ జరీన్ పైట్

టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ మహిళల 51 కిలోల విభాగంలో…భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ పాల్గొనటానికి ముందే…అర్హత పోటీలలో తెలంగాణా యువబాక్సర్ నిఖత్ జరీన్ తో తలపడటానికి రంగం సిద్ధమయ్యింది.

గతంలో 48 కిలోల విభాగంలో ఆరు ప్రపంచ టైటిల్స్ తో పాటు బంగారు పతకాలు సైతం సాధించిన మేరీ కోమ్…ఒలింపిక్స్ లో మాత్రం 51 కిలోల విభాగంలో పోటీకి దిగాలని నిర్ణయించింది. భారత బాక్సింగ్ సంఘం సైతం 51 కిలోల ఎంపిక పోటీల కోసం మేరీ కోమ్ ను నేరుగా ఎంపిక చేయడం వివాదానికి దారితీసింది.

నిఖత్ జరీన్ సవాల్…

మహిళల 51 కిలోల విభాగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న తెలంగాణాబాక్సర్ నిఖత్ జరీన్ మాత్రం… ఒలింపిక్స్ ట్రైల్స్ కు మేరీకోమ్ ను ఎంపిక చేయటాన్ని తప్పుపట్టింది .48 కిలోల విభాగానికి మాత్రమే పరిమితం కావాల్సిన మేరీకోమ్ ను …సెలెక్షన్ ట్రైల్స్ నిర్వహించకుండా 51 కిలోల విభాగానికి ఎలా ఎంపిక చేస్తారని నిలదీసింది.

మేరీ కోమ్ కు దమ్ముంటే…అర్హత పోటీలలో తనతో తలపడి నెగ్గిన తర్వాతే ఒలింపిక్స్ కు వెళ్లాలని డిమాండ్ చేసింది. మేరీ కోమ్ మాత్రం… అసలు నిఖత్ జరీన్ ఎవరంటూ ప్రశ్నించింది.

మేరీకోమ్- నిఖత్ జరీన్ వివాదం కేంద్ర క్రీడామంత్రికి మాత్రమేకాదు…భారత బాక్సింగ్ సమాఖ్యకు సైతం తలనొప్పిగా మారింది. దీంతో నిబంధనల ప్రకారం… మేరీ కోమ్, నిఖత్ జరీన్ ల మధ్య అర్హత పోటీ నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

చైనాలోని వూహాన్ వేదికగా ఫిబ్రవరి 3 నుంచి జరిగే ఒలింపిక్స్ అర్హత పోటీలకు ముందే…మేరీకోమ్- నిఖత్ జరీన్ ఫైట్ ను నిర్వహించాలని భారత బాక్సింగ్ సమాఖ్య నిర్ణయించింది.

డిసెంబర్ ఆఖరి వారంలో జరిగే ఈ అర్హత సమరానికి సిద్ధంకావాలని ఇటు మేరీకోమ్…అటు నిఖత్ జరీన్ లకు సైతం వ్యక్తిగతంగా సమాచారం పంపారు.

మేరీ కోమ్ కు మినహాయింపు లేదు…

ప్రపంచ బాక్సింగ్ పోటీలలో స్వర్ణ, రజత పతకాలు సాధించిన బాక్సర్లకు మాత్రమే నేరుగా ఒలింపిక్స్ ట్రైల్స్ లో పాల్గొనే వెసలుబాటు ఉంటుంది. మేరీ కోమ్ మాత్రం.. ప్రపంచ బాక్సింగ్ పోటీలలో కాంస్య పతకం మాత్రమే నెగ్గడంతో…సెలెక్షన్ ట్రైల్స్ లో పాల్గొనక తప్పని పరిస్థితి ఏర్పడింది.

First Published:  9 Nov 2019 9:44 PM GMT
Next Story