ఎన్నికల్లో 20 కోట్లు ఖర్చవుతోంది....
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు 2014 ఎన్నికల్లో గెలిచేందుకు రూ.11.5 కోట్లు ఖర్చు చేశానని గతంలో చెప్పారు. మొన్నటి ఎన్నికల సమయంలో టీడీపీ ఎంపీగా ఉంటూ జేసీ దివాకర్ రెడ్డి 50 కోట్లు ఖర్చు అవుతోందని సెలవిచ్చారు. ఇప్పుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఎన్నికల్లో డబ్బు బాగా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోయారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 20 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. దానికి తోడు మద్యం కూడా పంచాల్సి వస్తోందన్నారు. ఇంత ఖర్చు […]

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు 2014 ఎన్నికల్లో గెలిచేందుకు రూ.11.5 కోట్లు ఖర్చు చేశానని గతంలో చెప్పారు. మొన్నటి ఎన్నికల సమయంలో టీడీపీ ఎంపీగా ఉంటూ జేసీ దివాకర్ రెడ్డి 50 కోట్లు ఖర్చు అవుతోందని సెలవిచ్చారు.
ఇప్పుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఎన్నికల్లో డబ్బు బాగా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోయారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 20 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. దానికి తోడు మద్యం కూడా పంచాల్సి వస్తోందన్నారు.
ఇంత ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత ప్రజా సేవ ఏం చేస్తారు? సంపాదించుకున్న సొమ్మును తిరిగి రాబట్టుకోవడం కోసం సొంత పనులు చేసుకుంటారు అని వ్యాఖ్యానించారు. 12 సార్లు ఇప్పటి వరకు పోటీ చేశానని… కానీ మొన్నటి ఎన్నికలలో ఇంకా ఎక్కువ ఖర్చుపెట్టాల్సి వచ్చిందన్నారు. అయ్యన్న ఆవేదన చూస్తుంటే మొన్నటి ఎన్నికల్లో భారీగానే కుమ్మరించినట్టు ఉన్నారు.
- chintakayala ayyanna patrudu chintakayala ayyanna patrudu comments election fund Comments election fund film news Political news political telugu news telugu film news Telugu movie news Telugu News telugu web news portal telugu web news portals teluguglobal english teluguglobal telugu teluguglobal telugu web news portal tollywood news