Telugu Global
NEWS

రెండో టీ-20 మ్యాచ్ కు మహా గండం

రాజ్ కోట కు భారీ తుపాను హెచ్చరిక రాజ్ కోట వేదికగా ఈనెల 7న జరిగే భారత్- బంగ్లాదేశ్ జట్ల రెండో టీ-20 మ్యాచ్ కు మహా తుపాను గండం పొంచి ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన మహా తుపాను…భీకర రూపం ధరించి…రాజ్ కోట మీదుగా దాటే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ గురువారం జరుగనుండగా..మంగళ, బుధవారాలలో రాజ్ కోటను మహా తుపాను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు…మ్యాచ్ వేదిక రాజ్ […]

రెండో టీ-20 మ్యాచ్ కు మహా గండం
X
  • రాజ్ కోట కు భారీ తుపాను హెచ్చరిక

రాజ్ కోట వేదికగా ఈనెల 7న జరిగే భారత్- బంగ్లాదేశ్ జట్ల రెండో టీ-20 మ్యాచ్ కు మహా తుపాను గండం పొంచి ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన మహా తుపాను…భీకర రూపం ధరించి…రాజ్ కోట మీదుగా దాటే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మ్యాచ్ గురువారం జరుగనుండగా..మంగళ, బుధవారాలలో రాజ్ కోటను మహా తుపాను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

మరోవైపు…మ్యాచ్ వేదిక రాజ్ కోట క్రికెట్ స్టేడియం వికెట్ , అవుట్ ఫీల్డ్ ను ..ముందు జాగ్రతగా కవర్లతో కప్పి ఉంచామని..ఎంత భారీవర్షం కురిసినా.. కొద్ది సమయంలోనే మ్యాచ్ నిర్వహించడానికి తాము సిద్ధమని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం చైర్మన్ జయదేవ్ షా తెలిపారు.

అరేబియా సముద్రతీరానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్ కోట పై మహా తుపాను తీవ్రప్రభావం చూపనుంది.
మూడుమ్యాచ్ ల ప్రస్తుత సిరీస్ లోని తొలిమ్యాచ్ ను 7 వికెట్లతో నెగ్గడం ద్వారా బంగ్లాదేశ్ 1-0తో పైచేయి సాధించింది.

First Published:  5 Nov 2019 12:27 AM GMT
Next Story