Telugu Global
NEWS

చింతకాయల కొడుకు చిరంజీవిని బండబూతులు తిట్టాడు.... ఆ వీడియో పంపిస్తా చూడు పవన్‌...

ప్రభుత్వమే ఇసుకను గోడౌన్స్‌లో దాచిపెట్టినట్టుగా ఇసుక ఇసుక అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ పిసుక్కుంటున్నారని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. వరదల కారణంగా ఇసుక కొరత వచ్చింది నిజమేనన్నారు. మరో 15 రోజుల్లో ఇసుక సమస్య పరిష్కారం అవుతుందన్నది అందరికీ తెలుసన్నారు. కానీ ఈ లోపు రాజకీయంగా మైలేజ్‌ కోసం గుంటనక్కల్లా ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు. ఈ గుంటనక్క టీడీపీకి కష్టం వచ్చినప్పుడు పవన్‌ కల్యాణ్ తెరపైకి వస్తుంటారన్నారు. ఇప్పుడు ఇసుక సమస్యను కూడా టీడీపీ […]

చింతకాయల కొడుకు చిరంజీవిని బండబూతులు తిట్టాడు.... ఆ వీడియో పంపిస్తా చూడు పవన్‌...
X

ప్రభుత్వమే ఇసుకను గోడౌన్స్‌లో దాచిపెట్టినట్టుగా ఇసుక ఇసుక అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ పిసుక్కుంటున్నారని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. వరదల కారణంగా ఇసుక కొరత వచ్చింది నిజమేనన్నారు. మరో 15 రోజుల్లో ఇసుక సమస్య పరిష్కారం అవుతుందన్నది అందరికీ తెలుసన్నారు. కానీ ఈ లోపు రాజకీయంగా మైలేజ్‌ కోసం గుంటనక్కల్లా ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు.

ఈ గుంటనక్క టీడీపీకి కష్టం వచ్చినప్పుడు పవన్‌ కల్యాణ్ తెరపైకి వస్తుంటారన్నారు. ఇప్పుడు ఇసుక సమస్యను కూడా టీడీపీ తరపున పవన్ కల్యాణ్ తన భుజాన వేసుకున్నారన్నారు. లాంగ్ మార్చ్‌లో పవన్‌ కల్యాణ్… అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడిని పక్కన పెట్టుకుని మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు.

భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వందల కోట్లు మంత్రిగా దారి మళ్లించిన వ్యక్తి అచ్చెన్నాయుడు అని… అలాంటి వ్యక్తి భుజం మీద చేయి వేసి పవన్ కల్యాణ్ మాట్లాడడం బట్టే ఆయన విశ్వసనీయత కోల్పోయారన్నారు.

అయ్యన్నపాత్రుడి కుమారుడు …. చిరంజీవిని పచ్చిబూతులు తిట్టిన విషయం పవన్ కల్యాణ్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ఆ వీడియో పవన్ కల్యాణ్ చూసి ఉండకపోతే… తాము పవన్ కల్యాణ్‌కు ఆ వీడియో పంపిస్తామన్నారు. సొంత అన్నను అత్యంత దారుణంగా కించపరిచిన చింతకాయల అయ్యన్నపాత్రుడిని పక్కన పెట్టుకుని పోరాటం చేయడం ద్వారా ఏం సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు.

దత్తపుత్రుడు అంటే పవన్ కల్యాణ్‌కు ఎందుకు కోపం వస్తుందో అర్థం కావడం లేదన్నారు. పవన్ కల్యాణ్‌ ఏమో అందరినీ తాట తీస్తా… తోలు తీస్తా అని అనవచ్చు .. కానీ ఎవరైనా ఆయనపై విమర్శలు చేస్తే మాత్రం ఊగిపోతుంటారని విమర్శించారు. హిస్టిరియా వచ్చినట్టు ఊగిపోతూ… నోటికి ఎంత మాట వస్తే అంతమాట ప్రత్యర్థులపై పవన్ కల్యాణ్ అనవచ్చు గానీ… తాము ఎదురు ప్రశ్నించకూడదా అని నిలదీశారు.

సినిమాలను వదిలేసినా యాక్టింగ్‌ను మాత్రం పవన్ కల్యాణ్ వదిలిపెట్టడం లేదన్నారు. మట్టి పిడతలో అన్నం తినడం, కారు డిక్కీలో కూర్చొని టీ తాగడం, ట్రైన్‌లో టాయిలెట్‌ పక్కన కూర్చుని పుస్తకాలు చదవడం, ఆవులకు అరటిపండ్లు పెడుతూ ఫోజులు … ఇలా ప్రతి దానికి డ్రామా చేయడం పవన్‌ కల్యాణ్‌కు అలవాటుగా మారిందన్నారు. ఈ డ్రామాలు ఆడేటప్పుడే ఫోటోలు తీయడానికి ప్రత్యేకంగా ఒకరిని పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

మట్టి పిడతలో అన్నం తినడం, కారు డిక్కీలో కూర్చొని టీ తాగడం, ట్రైన్‌లో టాయిలెట్‌ పక్కన కూర్చుని పుస్తకాలు చదవడం వంటి సీన్లు మాత్రం పండడం లేదని, కామెడీగా ఉందని… అందుకే మొన్న పవన్ కల్యాణ్‌కు అలాంటి రిజల్ట్ వచ్చిందన్నారు.

జగన్‌ అంటే పవన్ కల్యాణ్‌ విపరీతమైన జెలసీతో బాధపడుతున్నారని కన్నబాబు వ్యాఖ్యానించారు. అసలు పవన్‌ కల్యాణ్‌కు, జగన్‌కు ఎక్కడైనా పోలిక ఉందా అని ప్రశ్నించారు. జగన్‌ను చూసి సంస్కారం ఏంటో పవన్ కల్యాణ్ నేర్చుకోవాలన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనే టార్గెట్‌, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగనే టార్గెట్ అన్నట్టుగా పవన్ కల్యాణ్ తీరు ఉందన్నారు. రెండు లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్‌కు… ఆ పుస్తకాల్లో ఎక్కడైనా వరదల్లో ఇసుక తీసే టెక్నాలజీ గురించి తెలిసి ఉంటే చెప్పాలన్నారు.

కృష్ణానదిలో కట్టిన అక్రమ కట్టడం కూల్చేస్తారన్న బాధతో పవన్ కల్యాణ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. రెండున్నర కిలోమీటర్లు చేసేదే లాంగ్ మార్చ్ అయితే… మరి జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు వేల 600 కిలోమీటర్ల పాదయాత్రను ఏమనాలని ప్రశ్నించారు.

స్థిరంగా నిలబడి… ఊగకుండా రెండు నిమిషాలు మాట్లాడే శక్తి పవన్ కల్యాణ్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో తనను పరిగెత్తించి తంతానంటూ ఊగిపోయారన్నారు. కానీ చివరకు రెండు చోట్లా పవన్ కల్యాణ్ నే ప్రజలు పరిగెత్తించి కొట్టారని కన్నబాబు గుర్తు చేశారు. కన్నబాబు బతుకేంటో తెలుసంటూ ఇటీవల పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారని… కానీ నా జీవితంలో ఏదైనా సీక్రెట్‌ ఉందా అని ప్రశ్నించారు.

ఇప్పటికీ చిరంజీవి తనను సొంత తమ్ముడిలా చూస్తుంటారని కన్నబాబు చెప్పారు. చిరంజీవిని తాను ఎన్నడూ మరిచిపోలేదన్నారు. చిరంజీవి వల్లే రాజకీయాల్లోకి వచ్చానని ఇప్పటికీ తాను చెబుతుంటానని… కానీ చిరంజీవి వల్లే సినిమాల్లోకి వచ్చా, చిరంజీవి వల్లే ఎదిగా అని పవన్ కల్యాణ్ ఏనాడైనా చెప్పారా అని ప్రశ్నించారు.

విజయసాయిరెడ్డికి ఉన్న అర్హతలు పవన్ కల్యాణ్‌కు ఉన్నాయా అని ప్రశ్నించారు. దత్తపుత్రుడు అని అంటేనే ఊగిపోతున్న పవన్ కల్యాణ్… చంద్రబాబుతో సంబంధాలు లేవని చెప్పగలరా అని ప్రశ్నించారు. గాజువాకలో చంద్రబాబు ప్రచారానికి రాకపోవడం, మంగళగిరిలో పవన్ కల్యాణ్ ప్రచారానికి రాకపోవడం వెనుక అసలు బంధం ఏంటో ప్రజలకు తెలియదనుకుంటున్నారా అని నిలదీశారు.

అంబటి రాంబాబు పిలిస్తే ఆయన కుమార్తె పెళ్లికి వెళ్లాను… కాబట్టి ఆయన జీవితాంతం తనకు రుణపడి ఉండాలన్నట్టుగా ఇటీవల ప్రతి మీటింగ్‌లో మాట్లాడడం పవన్ కల్యాణ్‌కు అలవాటుగా మారిందన్నారు. పెళ్లికి వెళ్లినంత మాత్రాన జీవితాంతం రుణపడి ఉండాలా అని కన్నబాబు ప్రశ్నించారు.

First Published:  5 Nov 2019 9:41 AM GMT
Next Story