Telugu Global
NEWS

మంచిరెడ్డి, మల్‌రెడ్డి మధ్య పొలిటికల్‌ ఫైట్‌

తహశీల్దార్‌ విజయారెడ్డి హత్యవెనుక రాజకీయ శక్తులున్నాయా..? రియల్‌ ఎస్టేట్‌ మాఫియా దాగుందా..? ఔటర్‌కు దగ్గరగా ఉన్న గౌరెల్లి గ్రామంలో ఏం జరుగుతోంది? అక్కడి భూ వివాదాలు ఇంతటి కార్పణ్యాలకు దారితీయడానికి కారణాలేంటి..? ఇప్పుడివే సందేహాలు అందరిలోనూ రేకెత్తుతున్నాయి. ఈ అనుమానాలకు మరింత పెట్రోల్‌ పోసినట్లు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచిరెడ్డి వల్లే విజయారెడ్డి హత్యకు గురైందని ఆరోపించారు. ఆరు నెలలు కిందట గౌరెల్లి గ్రామస్తులు […]

మంచిరెడ్డి, మల్‌రెడ్డి మధ్య పొలిటికల్‌ ఫైట్‌
X

తహశీల్దార్‌ విజయారెడ్డి హత్యవెనుక రాజకీయ శక్తులున్నాయా..? రియల్‌ ఎస్టేట్‌ మాఫియా దాగుందా..? ఔటర్‌కు దగ్గరగా ఉన్న గౌరెల్లి గ్రామంలో ఏం జరుగుతోంది? అక్కడి భూ వివాదాలు ఇంతటి కార్పణ్యాలకు దారితీయడానికి కారణాలేంటి..? ఇప్పుడివే సందేహాలు అందరిలోనూ రేకెత్తుతున్నాయి.

ఈ అనుమానాలకు మరింత పెట్రోల్‌ పోసినట్లు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచిరెడ్డి వల్లే విజయారెడ్డి హత్యకు గురైందని ఆరోపించారు.

ఆరు నెలలు కిందట గౌరెల్లి గ్రామస్తులు వెళ్లి మంచిరెడ్డిని కలిశారని… వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ వ్యవహారంలో 25 లక్షల రూపాయలు చేతులు మారాయని… పాస్‌ పుస్తకాలు వచ్చిన తర్వాత మిగతా డబ్బులు ఇచ్చేందుకు కొందరు రైతులు ఒప్పుకున్నారనేది మల్‌రెడ్డి చేస్తున్న వాదన.

అయితే మల్‌రెడ్డి ప్రస్టేషన్‌లో ఉన్నారని…మూడు సార్లు ఓడిన బాధలో ఏవో ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి. గౌరెల్లిలో ఇనాం భూమల సమస్య ఉన్నమాట వాస్తమేనని… ఈసమస్య పరిష్కారం కోసం 60 మంది గ్రామస్తులు వస్తే….జాయింట్‌ కలెక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడానని చెప్పారు. అంతేకానీ ఎలాంటి జోక్యం చేసుకోలేదని చెప్పుకొచ్చారు.

అయతే తహసీల్దార్ హత్య తర్వాత గౌరెల్లి జనం సైలంట్‌ అయిపోయారు. పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. ఈ హత్యలో పైకి సురేష్‌ పాత్ర కనిపిస్తుంటే… తెరవెనుక సూత్రధారులు ఎవరైనా ఉన్నారా? అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి.

తహసీల్దార్‌ హత్య తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న భూవివాదాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రియల్టర్లు, బడా బిజినెస్‌మేన్‌ లు ఎవరైనా సురేష్‌ను ఉసిగొల్పారా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేయాలని కొందరు గ్రామస్తులు కోరుతున్నారు.

First Published:  5 Nov 2019 9:38 AM GMT
Next Story