కొత్త సీఎస్‌గా నీలం సాహ్ని! జగన్‌ను కలిసి లంచ్
ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడంలో కాలయాపన చేయడంతో పాటు… సీఎంవోతో ఘర్షణ పడ్డ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసిన నేపథ్యంలో కొత్త సీఎస్‌గా ఎవరిని నియమిస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. తాత్కాలిక సీఎస్‌గా నీరబ్ కుమార్‌ను నియమించారు. తదుపరి సీఎస్‌గా మహిళా ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్ని నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె కేంద్ర సాంఘిక న్యాయ, సాధికారిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఏపీ కేడర్‌కు చెందిన ఆమె డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. […]
ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడంలో కాలయాపన చేయడంతో పాటు… సీఎంవోతో ఘర్షణ పడ్డ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసిన నేపథ్యంలో కొత్త సీఎస్‌గా ఎవరిని నియమిస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. తాత్కాలిక సీఎస్‌గా నీరబ్ కుమార్‌ను నియమించారు. తదుపరి సీఎస్‌గా మహిళా ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్ని నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం ఆమె కేంద్ర సాంఘిక న్యాయ, సాధికారిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఏపీ కేడర్‌కు చెందిన ఆమె డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు.
ఎల్వీని బదిలీ నేపథ్యంతో నీలం సాహ్ని నిన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఆయనతో కలిసి భోజనం చేశారు. పాలన అంశాలపై చర్చించారు. ఏపీలో పనిచేసేందుకు నీలం సాహ్ని ఆసక్తి కనబరిచారు.
సీనియారిటీ జాబితాలోనూ నీలం సాహ్ని పేరు ఉంది. సీనియారిటీ ప్రకారం 1983 బ్యాచ్‌కు చెందిన ప్రీతి సూదన్ ముందున్నారు. ఆ తర్వాత 1984 బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని, ఏపీ సాహ్నిలు ఉన్నారు. నీలం సాహ్ని, ఏపీ సాహ్నిలు భార్యభర్తలు. ఆ తర్వాత సీనియారిటీ జాబితాలో 1985 బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మ, రెడ్డి సుబ్రమణ్యం ఉన్నారు.
జాబితాలో తొలిస్థానంలో ఉన్న ప్రీతి సూదన్ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నీలం సాహ్నిని కొత్త సీఎస్‌గా నియమించేందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నారు. రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.