Telugu Global
NEWS

కలాం పేరు తీసేసి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడంపై జగన్‌ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో కొందరు అధికారుల అత్యుత్సాహం చివరకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటోంది. తాజాగా విద్యా శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై సీఎం మండిపడ్డారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కార్‌ అవార్డు పేరును వైఎస్‌ఆర్‌ విద్యా పురస్కారాలుగా మార్చి విద్యా శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అబ్దుల్ కలాం పేరు మార్పు గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలాం పేరును మార్చడానికి వీల్లేదని వెంటనే ఉత్తర్వులు వెనక్కు తీసుకోవాలని ఆదేశించారు. […]

కలాం పేరు తీసేసి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడంపై జగన్‌ ఫైర్
X

ఆంధ్రప్రదేశ్‌లో కొందరు అధికారుల అత్యుత్సాహం చివరకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటోంది. తాజాగా విద్యా శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై సీఎం మండిపడ్డారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కార్‌ అవార్డు పేరును వైఎస్‌ఆర్‌ విద్యా పురస్కారాలుగా మార్చి విద్యా శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

అబ్దుల్ కలాం పేరు మార్పు గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలాం పేరును మార్చడానికి వీల్లేదని వెంటనే ఉత్తర్వులు వెనక్కు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి అంశాలను తన దృష్టికి తీసుకురాకుండా ఎలా నిర్ణయాలు తీసుకున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

ప్రతిభా పురస్కారాల పేరును మారుస్తూ వచ్చిన జీవోను తక్షణం రద్దు చేయాలని ఆదేశించారు. అబ్దుల్ కలాం పేరును కొనసాగించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఏవైనా అవార్డులు కొత్తగా ఇవ్వాలనుకుంటే గాంధీ, అంబేద్కర్, పూలే, జగ్జీవన్‌రాం వంటి మహనీయుల పేర్లు పెట్టాలని సీఎం ఆదేశించారు. పరోక్షంగా అన్ని అవార్డులకు తన తండ్రి పేరే పెట్టాల్సిన అవసరం లేదని అధికారులకు స్పష్టం చేశారు సీఎం.

అబ్దుల్ కలాం పేరుతో ప్రతిభా పురస్కారాలను ప్రతి ఏటా 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందజేస్తారు.

First Published:  5 Nov 2019 12:29 AM GMT
Next Story