Telugu Global
National

30 సెకెన్లు మోగాల్సిందే.. టెలికాం సంస్థలకు ట్రాయ్ అల్టిమేటం..!

దేశీయ ప్రైవేటు టెలికాం కంపెనీల మధ్య తీవ్ర వివాదానికి కారణమైన ‘కాల్స్ రింగ్ టైం’ యుద్దానికి ట్రాయ్ తెరదించింది. ఇకపై ఏ కంపెనీ అయినా కనీసం 30 సెకెన్ల పాటు రింగ్ టైం అందించాలని నిర్థేశించింది. మొబైల్ ఫోన్లకు 30 సెకెన్లు, ల్యాండ్ ఫోన్లకు 60 సెకెన్ల పాటు రింగ్ టైం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రతీ కాల్ 45  సెకెన్ల పాటు రింగ్ అవుతూ ఉండేది. అయితే రిలయన్స్ జియో వచ్చిన తర్వాత […]

30 సెకెన్లు మోగాల్సిందే.. టెలికాం సంస్థలకు ట్రాయ్ అల్టిమేటం..!
X

దేశీయ ప్రైవేటు టెలికాం కంపెనీల మధ్య తీవ్ర వివాదానికి కారణమైన ‘కాల్స్ రింగ్ టైం’ యుద్దానికి ట్రాయ్ తెరదించింది. ఇకపై ఏ కంపెనీ అయినా కనీసం 30 సెకెన్ల పాటు రింగ్ టైం అందించాలని నిర్థేశించింది. మొబైల్ ఫోన్లకు 30 సెకెన్లు, ల్యాండ్ ఫోన్లకు 60 సెకెన్ల పాటు రింగ్ టైం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

గతంలో ప్రతీ కాల్ 45 సెకెన్ల పాటు రింగ్ అవుతూ ఉండేది. అయితే రిలయన్స్ జియో వచ్చిన తర్వాత దీనికి 25 సెకెన్లకు తగ్గించింది. దీంతో మిగిలిన కంపెనీలు కూడా జియో బాట పట్టాయి. దీంతో నెట్‌వర్క్‌లో మిస్డ్ కాల్స్ సంఖ్య పెరిగిపోయింది. వినియోగదారుడు స్పందించి కాల్ తీసే లోపే కాల్స్ కట్ అయిపోతుండటంతో మిస్డ్ కాల్స్ సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరిగిపోయింది.

ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన ట్రాయ్ కాలింగ్ రింగ్ టైంను 30 సెకెన్లుగా నిర్థేశించింది. ఇకపై కాల్ ఎత్తకపోయినా.. రిజెక్ట్ చేసినా.. ఇన్ కమింగ్ వాయిస్ కాల్స్ తప్పని సరిగా ఈ సమయాన్ని అమలు చేయాల్సిందే. ట్రాయ్ తీసుకొచ్చిన ఈ నిబంధనతో టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయినట్లే నని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

First Published:  2 Nov 2019 12:33 AM GMT
Next Story