Telugu Global
NEWS

టీ-20 మహిళా ప్రపంచకప్ ఆవిష్కరణ

మెల్బోర్న్ లో ట్రోఫీని ఆవిష్కరించిన కరీనాకపూర్ ఫిబ్రవరి 21 నుంచి మహిళా టీ-20 ప్రపంచకప్ ఆస్ట్ర్రేలియా వేదికగా ఫిబ్రవరి 21 న ప్రారంభమయ్యే 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ ట్రోఫీని బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ ఆవిష్కరించింది. మెల్బో్ర్న్ లో నిర్వహించిన ప్రపంచ కప్ కౌంట్ డౌన్ కార్యక్రమంలో కరీనాకపూర్ ప్రత్యేక అతిథిగా పాల్గొంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకూ జరిగే ఈ టోర్నీలో తలపడే వివిధ దేశాల జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. థాయ్ […]

టీ-20 మహిళా ప్రపంచకప్ ఆవిష్కరణ
X
  • మెల్బోర్న్ లో ట్రోఫీని ఆవిష్కరించిన కరీనాకపూర్
  • ఫిబ్రవరి 21 నుంచి మహిళా టీ-20 ప్రపంచకప్

ఆస్ట్ర్రేలియా వేదికగా ఫిబ్రవరి 21 న ప్రారంభమయ్యే 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ ట్రోఫీని బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ ఆవిష్కరించింది. మెల్బో్ర్న్ లో నిర్వహించిన ప్రపంచ కప్ కౌంట్ డౌన్ కార్యక్రమంలో కరీనాకపూర్ ప్రత్యేక అతిథిగా పాల్గొంది.

ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకూ జరిగే ఈ టోర్నీలో తలపడే వివిధ దేశాల జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. థాయ్ లాండ్ జట్టు తొలిసారిగా మహిళా ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించడం విశేషం.

గ్రూప్ -ఏలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియా, ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ విన్నర్ బంగ్లాదేశ్, భారత్, న్యూజిలాండ్ , శ్రీలంక తలపడతాయి.

గ్రూప్- బీ లీగ్ లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, థాయ్ లాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫిబ్రవరి 21న జరిగే పోటీలో ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాను భారత్ ఢీ కోనుంది.

మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం రోజునే…మెల్బోర్న్ వేదికగా మహిళా ప్రపంచకప్ టైటిల్ సమరాన్ని నిర్వహిస్తారు.
పురుషుల టీ-20 ప్రపంచకప్ ఆస్ట్ర్రేలియా వేదికగానే…అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకూ జరుగనుంది.

First Published:  1 Nov 2019 5:31 AM GMT
Next Story