Telugu Global
NEWS

నేడు పోలవరం పనులను ప్రారంభించనున్న మేఘా...

నవయుగ సంస్థ వేసిన పిటిషన్‌ ఆధారంగా పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై ఇచ్చిన స్టేను హైకోర్టు ఎత్తివేయడంతో పోలవరం నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం … రివర్స్ టెండరింగ్‌లో కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా సంస్థతో నేడు ఒప్పందం చేసుకోనుంది. పోలవరం డ్యాం, హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మేఘా సంస్థతో ఏపీ జలవనరుల శాఖ, ఏపీ జెన్‌కో వేరువేరుగా ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఒప్పందాలు చేసుకున్న వెంటనే మేఘా సంస్థ […]

నేడు పోలవరం పనులను ప్రారంభించనున్న మేఘా...
X

నవయుగ సంస్థ వేసిన పిటిషన్‌ ఆధారంగా పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై ఇచ్చిన స్టేను హైకోర్టు ఎత్తివేయడంతో పోలవరం నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం … రివర్స్ టెండరింగ్‌లో కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా సంస్థతో నేడు ఒప్పందం చేసుకోనుంది. పోలవరం డ్యాం, హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మేఘా సంస్థతో ఏపీ జలవనరుల శాఖ, ఏపీ జెన్‌కో వేరువేరుగా ఒప్పందాలు చేసుకోనున్నాయి.

ఒప్పందాలు చేసుకున్న వెంటనే మేఘా సంస్థ పనులను ప్రారంభించనుంది. మేఘా సంస్థతో ఒప్పందం చేసుకుని వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు.

నేడు మేఘా సంస్థ లాంచనంగా పోలవరం నిర్మాణ పనులను ప్రారంభించనుంది. గోదావరికి వరద తగ్గగానే శరవేగంగా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ సిద్ధమవుతోంది.

2021 నాటికి పోలవరం పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ ప్రాజెక్టులను కూడా నిర్ణీత వ్యవధిలోనే పూర్తి చేసిన తిరుగులేని రికార్డు ఉన్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు పోలవరం పనులు పూర్తి చేయడం ఏమంత పెద్ద పని కాదని భావిస్తున్నారు.

గురువారం పోలవరం వద్ద గోదావరి వరద రెండు లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద తగ్గగానే పనులు ప్రారంభించి 2020 మే నాటికి స్పిల్‌ వే, స్పిల్ చానల్‌, కాఫర్ డ్యాం పనులతో పాటు 41.5 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులనూ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2021నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టార్గెట్‌గా పెట్టుకున్నారు.

First Published:  31 Oct 2019 7:48 PM GMT
Next Story