Telugu Global
Cinema & Entertainment

'మీకు మాత్రమే చెప్తా' సినిమా రివ్యూ

రివ్యూ : మీకు మాత్రమే చెప్తా రేటింగ్ : 2.25/5 తారాగణం :  తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అనసూయ భరద్వాజ్‌, అభినవ్‌ గౌతమ్‌, పావని, నవీన్‌ జార్జ్‌, అవంతిక మిశ్రా తదితరులు సంగీతం : శివకుమార్‌ నిర్మాత : విజయ్ దేవరకొండ దర్శకత్వం : షమ్మీర్‌ సుల్తాన్‌ విజయ్ దేవరకొండ నిర్మాత గా మారి చేసిన తొలి ప్రయత్నం మీకు మాత్రమే చెప్తా అనే సినిమా. ఈ సినిమా లో దర్శకుడు తరుణ్ భాస్కర్ ఫుల్ లెన్త్ హీరో పాత్ర ని పోషించాడు. హీరోయిన్ గా వాణి నటించింది. […]

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ
X

రివ్యూ : మీకు మాత్రమే చెప్తా
రేటింగ్ : 2.25/5
తారాగణం : తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అనసూయ భరద్వాజ్‌, అభినవ్‌ గౌతమ్‌, పావని, నవీన్‌ జార్జ్‌, అవంతిక మిశ్రా తదితరులు
సంగీతం : శివకుమార్‌
నిర్మాత : విజయ్ దేవరకొండ

దర్శకత్వం : షమ్మీర్‌ సుల్తాన్‌

విజయ్ దేవరకొండ నిర్మాత గా మారి చేసిన తొలి ప్రయత్నం మీకు మాత్రమే చెప్తా అనే సినిమా. ఈ సినిమా లో దర్శకుడు తరుణ్ భాస్కర్ ఫుల్ లెన్త్ హీరో పాత్ర ని పోషించాడు. హీరోయిన్ గా వాణి నటించింది. అభినవ్ మరియు అనసూయ ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి మంచి పాజిటివ్ బజ్ తో సినిమా ని ప్రమోట్ చేశారు చిత్ర యూనిట్. ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ:

రాకేష్ (తరుణ్ భాస్కర్) ఒక టెలివిజన్ ఛానల్ లో పని చేస్తూ ఉంటాడు. సాఫీగా తన జీవితాన్ని సాగిస్తున్న తరుణం లో ఒక డాక్టర్ (వాణి భోజన్) ను చూసి ప్రేమలో పడతాడు. చివరికి ఆ ప్రేమ ని పెళ్ళి పీటల దాకా తీసుకొచ్చిన టైం కి అతనికి సంబంధించిన ఒక పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది. నలుగురు కలిసి చూడడానికి వీల్లేని వీడియో అది. ఆ వీడియో వలన ఇప్పుడు తన జీవితం అల్లకల్లోలం అయ్యే స్థితి కి వస్తుంది. అసలు ఆ వీడియో లో ఏముంది? ఆ వీడియో బయట పడటం వలన ఏం జరిగింది? అప్పుడు రాకేష్ ఏం చేసాడు? అనేది సినిమా కథ.

నటీనటులు:

ఒక దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో తనలో ఒక నటుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. తన పాత్రలో ఒదిగిపోయి తరుణ్ భాస్కర్ చాలా బాగా నటించాడు. అభినవ్ తన పాత్ర కి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు. అభినవ్ స్క్రీన్ పైన ఉన్నంతసేపు సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది.

నవీన్ జార్జ్ థామస్ ఈ సినిమాలో చాలా బాగా నటించాడు.

అనసూయ భరద్వాజ్ తన పాత్రకి సంబంధించి డైలాగ్ డెలివరీ విషయంలో కానీ ఎక్స్ ప్రెషన్స్ విషయంలో కాని పాత్ర లోని వేరియేషన్స్ ని చాలా బాగా చూపించింది.

వాణి భోజన్ తన పాత్రకి 100% న్యాయం చేసింది. కేవలం తన అందంతో మాత్రమే కాకుండా పర్ఫార్మెన్స్ తో కూడా మన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మిగతా నటీనటులు ల లో అవంతిక మిశ్ర చక్కగా చేసింది. మిగిలిన అందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక వర్గం:

ఒక మంచి కథని ఎంపిక చేసుకున్న దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ కథని యువతకు కనెక్ట్ అయ్యే విధంగా చాలా బాగా తెరకెక్కించారు. కేవలం ఎంటర్ టైన్ మెంట్ కి బాగా ప్రాముఖ్యత ఇచ్చిన షమ్మీర్ సుల్తాన్ ప్రస్తుతం యువత ప్రతి సన్నివేశాన్ని బాగా కనెక్ట్ అయ్యే విధంగా చూపించారు.

ఒకవైపు ఎంటర్ టైన్ మెంట్ కి పెద్ద పీట వేస్తూనే మరోవైపు కథ ప్రకారంగా కూడా ఈ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ దేవరకొండ అందించిన నిర్మాణ విలువలు ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

శివ కుమార్ అందించిన సంగీతం చాలా బాగుంది. పాటల సంగతి పక్కన పెడితే శివకుమార్ ఈ సినిమాకి అందించిన నేపథ్య సంగీతం చాలా బాగా సెట్ అయింది. మతన్ గుణదేవ విజువల్స్ మరియు కెమెరా యాంగిల్స్ సినిమాని మరింత అందంగా మార్చాయి. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

సినిమా మొత్తం ఒక వీడియో చుట్టూ తిరుగుతూ ఉంటుంది తప్ప సినిమాలో ఒక బలమైన కథ అంటూ లేకపోవడం నిరాశ కలిగిస్తుంది.

సినిమా మొదలైన ఇరవై నిమిషాలపాటు కథ చాలా స్లోగా నడుస్తూ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. అయితే తర్వాత వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా అలరిస్తాయి.

ఇక ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే రెండవ భాగం బాగానే అనిపిస్తుంది… కానీ చాలావరకు సన్నివేశాలు రిపీట్ చేసినట్లు అనిపిస్తాయి.

నటీనటులు, కామెడీ బాగానే అనిపించినప్పటికీ బలమైన కథ లేకపోవడం ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. కేవలం ఎంటర్ టైన్ మెంట్ మీద మాత్రమే కాకుండా దర్శకుడు కథ పైన కూడా కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

బలాలు:

కామెడీ, నేపథ్య సంగీతం, సంభాషణలు

బలహీనతలు:

కథ బలహీనంగా ఉండడం, రిపీట్ అయ్యే సన్నివేశాలు

First Published:  1 Nov 2019 4:12 AM GMT
Next Story