Telugu Global
NEWS

డాలర్ శేషాద్రి తొలగింపు అనివార్యం... కారణం ఇదే...

తిరుమలలో సుధీర్ఘకాలంగా ఉంటున్న డాలర్ శేషాద్రికి ఉద్వాసన తప్పేలా లేదు. రిటైర్ అయిన తర్వాత కూడా రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగులు కాంట్రాక్టు బేసిక్‌ మీద కొనసాగుతూ ఉన్నారు. పలు స్థానాల్లో వారు పాతుకుపోయారు. కొత్త వారికి అవకాశాలు దక్కడం లేదు. ఈనేపథ్యంలో రిటైర్డ్ అధికారులను విధుల నుంచి తొలగించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా టీటీడీలో కీలక స్థానాల్లో ఉన్న 140 మంది రిటైర్డ్ ఉద్యోగులపై వేటు పడనుంది. ఈ జాబితాలో డాలర్ శేషాద్రి కూడా […]

డాలర్ శేషాద్రి తొలగింపు అనివార్యం... కారణం ఇదే...
X

తిరుమలలో సుధీర్ఘకాలంగా ఉంటున్న డాలర్ శేషాద్రికి ఉద్వాసన తప్పేలా లేదు. రిటైర్ అయిన తర్వాత కూడా రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగులు కాంట్రాక్టు బేసిక్‌ మీద కొనసాగుతూ ఉన్నారు. పలు స్థానాల్లో వారు పాతుకుపోయారు. కొత్త వారికి అవకాశాలు దక్కడం లేదు.

ఈనేపథ్యంలో రిటైర్డ్ అధికారులను విధుల నుంచి తొలగించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా టీటీడీలో కీలక స్థానాల్లో ఉన్న 140 మంది రిటైర్డ్ ఉద్యోగులపై వేటు పడనుంది.

ఈ జాబితాలో డాలర్ శేషాద్రి కూడా ఉన్నారు. డాలర్ శేషాద్రి ఆలయ ఓఎస్‌డీగా ఉన్నారు. 2019 మార్చి 31కి ముందు నియమితులైన రిటైర్డ్ ఉద్యోగులను తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకోవడంతో టీటీడీలో ఉన్న డాలర్ శేషాద్రిని తప్పించడం అనివార్యమైంది. అయితే తమను తప్పించకుండా ఉండేందుకు డాలర్ శేషాద్రితో పాటు పలువురు టీటీడీలోని రిటైర్డ్ ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారు.

1978లో టీటీడీలో ఒక సామాన్య ఉద్యోగిగా చేరిన శేషాద్రి తిరుగులేని వ్యక్తిగా మారారు. గతంలో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చినా వాటి నుంచి బయటపడుతూ వచ్చారు.

గతంలో బంగారు డాలర్లను మాయం చేశారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. 2006 లోనే పదవీ విరమణ చేసినప్పటికి ఆయన తిరుమలను వదిలిపెట్టలేదు. పలుమార్లు తన పదవికాలాన్ని పొడిగించుకుంటూ వస్తున్నారు.

2009లో శేషాద్రిని విధుల నుండి తప్పించాలంటూ హైకోర్టు ఓ కేసులో తీర్పు ఇచ్చినప్పటికీ…. తన పలుకుబడిని ఉపయోగించి కాంట్రాక్టు బేస్‌ కింద టీటీడీలో కొనసాగుతున్నారు. ఈసారి శేషాద్రికి మినహాయింపు వస్తుందో లేదో చూడాలి.

First Published:  31 Oct 2019 9:08 PM GMT
Next Story