ప్రభుత్వంపై తప్పుడు కథనాలు రాస్తే చర్యల జీవో జారీ
ప్రభుత్వంపై పనిగట్టుకుని విపక్షాలకు చెందిన మీడియా సంస్థలు అసత్య వార్తలను ప్రసారం చేస్తున్నాయన్న భావనతో అందుకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. ప్రభుత్వంపై గానీ, అధికారులపై గానీ తప్పుడు కథనాలు రాసిన, ప్రసారం చేసిన వారిపై చర్యలకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. దురుద్దేశ పూర్వకంగా ప్రభుత్వానికి లేనివి ఆపాదిస్తూ అసత్య ప్రచారం చేసే పత్రికలు, టీవీలు, ఇతర సామాజిక మాధ్యమాలపైనా కేసు పెట్టే అధికారం ఆయా శాఖ ముఖ్య […]

ప్రభుత్వంపై పనిగట్టుకుని విపక్షాలకు చెందిన మీడియా సంస్థలు అసత్య వార్తలను ప్రసారం చేస్తున్నాయన్న భావనతో అందుకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది.
ప్రభుత్వంపై గానీ, అధికారులపై గానీ తప్పుడు కథనాలు రాసిన, ప్రసారం చేసిన వారిపై చర్యలకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది.
దురుద్దేశ పూర్వకంగా ప్రభుత్వానికి లేనివి ఆపాదిస్తూ అసత్య ప్రచారం చేసే పత్రికలు, టీవీలు, ఇతర సామాజిక మాధ్యమాలపైనా కేసు పెట్టే అధికారం ఆయా శాఖ ముఖ్య కార్యదర్శులకు ప్రభుత్వం అప్పగించింది. 2007 ఫిబ్రవరి 20లో ఈ జీవోను ప్రభుత్వం జారీ చేసింది. దానికి మరిన్ని మార్పులు చేసి ఇప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న మీడియా అధినేతలు, ఎడిటర్లపైన చర్యలు తీసుకోనున్నారు. ప్రజలకు నిజమైన, కచ్చితమైన సమాచారం చేరాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
- BewareofYellowMedia ABN abn andhrajyothy abn radha krishna andhra pradesh news papers andhrajyothy paper ap 24x7 news ap government GO ap news papers Beware of YellowMedia chandrababu media chandrababu naidu yellow media chandrababu yellow media dirty media dramoji rao Eenadu eenadu group eenadu paper electronic media english news papers etv etv india Facebook fake news Indian Media indian news papers Instagram mahaa news Media national media News news papers NTV Radha Krishna Ramoji Rao sakshi group Sakshi Media Sakshi Paper Sakshi tv Social Media social media news social media platform social media publicity streem media studio N tdp media tdp radha krishna tdp ramoji rao Telugu Media Telugu News Telugu News Channels telugu news papers TV9 Twitter vemuri radha krishna web media worst media Yellow Media yellow media fake news yellow media fake news ap government GO yellow papers yellow radha krishna yellow ramoji rao