Telugu Global
Cinema & Entertainment

నాగచైతన్య "లవ్ స్టోరీ" ఇది

వెంకీమామ సినిమాను ఓ కొలిక్కి తీసుకొచ్చిన నాగచైతన్య, ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారు. మూవీకి లవ్ స్టోరీ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నాడు కమ్ముల. నిజానికి టైటిల్ ను ఇలా ముందుగానే రిలీజ్ చేయడం కమ్ములకు ఇష్టం ఉండదు. ఇది అతడి […]

నాగచైతన్య లవ్ స్టోరీ ఇది
X

వెంకీమామ సినిమాను ఓ కొలిక్కి తీసుకొచ్చిన నాగచైతన్య, ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారు. మూవీకి లవ్ స్టోరీ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నాడు కమ్ముల.

నిజానికి టైటిల్ ను ఇలా ముందుగానే రిలీజ్ చేయడం కమ్ములకు ఇష్టం ఉండదు. ఇది అతడి స్టయిల్ కాదు. సినిమా దాదాపు కంప్లీట్ అయిన తర్వాత టైటిల్ ను రిజిస్టర్ చేయించి, డిజైన్ పూర్తయిన తర్వాత పద్ధతి ప్రకారం బయటకు వదుల్తాడు. కానీ ఈ సినిమాతో నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్న ఏషియన్ మూవీస్ వ్యక్తులు మాత్రం ప్రాజెక్టుపై చాలా అత్యుత్సాహంతో ఉన్నారు. అందుకే ముందుగా ఇలా లీకుల రూపంలో లవ్ స్టోరీ అనే టైటిల్ ను బయటపెట్టారు.

నిజానికి నాగచైతన్యకు ఇది సరైన టైటిల్. లవ్ సబ్జెక్ట్స్ తోనే ఎక్కువగా సక్సెస్ లు అందుకున్నాడు ఈ హీరో. అటు సాయిపల్లవి కూడా ఇలాంటి పాత్రలకు పెట్టింది పేరు. అందుకే వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నాడు కమ్ముల. ప్రస్తుతానికి ఇది గాసిప్ మాత్రమే. త్వరలోనే అధికారికం అవుతుంది.

నాగచైతన్య ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు. అదే ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ కాబోతోంది. తెలంగాణ పల్లెల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ లో ఎలా కలుసుకున్నారు. వాళ్ల మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనే అంశాలతో ఈ సినిమా వస్తోంది.

First Published:  31 Oct 2019 1:47 AM GMT
Next Story