Telugu Global
NEWS

పవన్‌కు కన్నా మద్దతు... బీజేపీ నేతల అసంతృప్తి

ఇసుక కొరతకు ప్రభుత్వమే కారణమంటూ జనసేన నవంబర్‌ 3న విశాఖలో లాంగ్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం వేదికగా టీడీపీ- జనసేన తిరిగి చేతులు కలపబోతున్నాయి. చంద్రబాబుతో కలిసేందుకు బీజేపి సిద్ధంగా లేకపోవడంతో బీజేపీని కూడా తమ వైపు రప్పించేందుకు పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. కన్నా లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి లాంగ్ మార్చ్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా పవన్ కల్యాణ్ కోరారు. అప్పటికే చంద్రబాబు కూడా తమ కార్యక్రమానికి మద్దతు పలికిన అంశాన్ని…. కన్నా లక్ష్మీనారాయణకు పవన్ […]

పవన్‌కు కన్నా మద్దతు... బీజేపీ నేతల అసంతృప్తి
X

ఇసుక కొరతకు ప్రభుత్వమే కారణమంటూ జనసేన నవంబర్‌ 3న విశాఖలో లాంగ్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం వేదికగా టీడీపీ- జనసేన తిరిగి చేతులు కలపబోతున్నాయి. చంద్రబాబుతో కలిసేందుకు బీజేపి సిద్ధంగా లేకపోవడంతో బీజేపీని కూడా తమ వైపు రప్పించేందుకు పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. కన్నా లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి లాంగ్ మార్చ్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా పవన్ కల్యాణ్ కోరారు.

అప్పటికే చంద్రబాబు కూడా తమ కార్యక్రమానికి మద్దతు పలికిన అంశాన్ని…. కన్నా లక్ష్మీనారాయణకు పవన్ వివరించినట్టు తెలుస్తోంది. దాంతో కన్నా లక్ష్మీనారాయణ కూడా జనసేన లాంగ్‌ మార్చ్‌కు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు కన్నా లక్ష్మీనారాయణ అంగీకరించారు. ఈ అంశాన్ని టీడీపీ పత్రికలు కూడా వెల్లడించాయి.

కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయంపై బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటే…. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ట్రాప్‌లో బీజేపీని కన్నా లక్ష్మీనారాయణ పదేపదే పడేస్తున్నారని బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. జనసేన నిర్వహించే కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం ఆ పార్టీకి బీజేపీకి తోక పార్టీగా మార్చడమేనని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి ఈ అంశంపై వివరణ ఇచ్చారు. ఇసుక కొరత అంశంపై పోరాటానికి కన్నా లక్ష్మీనారాయణ మద్దతు ఇచ్చి ఉండవచ్చు కానీ… జనసేన నిర్వహించే లాంగ్ మార్చ్‌లో బీజేపీ పాల్గొనే అవకాశమే లేదని ప్రకటించారు. ఇసుక అంశంపై పోరాటంలో బీజేపీనే ముందుండి నడిపిస్తుందని వ్యాఖ్యానించారు.

జనసేన కార్యక్రమంతో తమకు సంబంధం లేదని… నవంబర్‌ 4న బీజేపీ సొంతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతోందని విష్ణువర్థన్ రెడ్డి ప్రకటించారు.

First Published:  31 Oct 2019 12:22 AM GMT
Next Story