Telugu Global
NEWS

ఒత్తిడి తట్టుకోలేక ప్రకృతి వైద్యానికి ఉత్తమ్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రశాంతతను వెతుక్కునే పనిలో ఉన్నారు. వరుసగా ఎన్నికలు, రెండు సార్లు భార్య ఓటమితో… ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ఆర్ధికంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ ఎంపీగా గెలిచిన ఆయన తాను రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజూర్‌నగర్ నుంచి భార్యను గెలిపించుకోలేకపోయారు. 42వేల ఓట్ల భారీ తేడాతో కాంగ్రెస్ ఇక్కడ చిత్తయింది. పార్టీ పరంగానూ ఉత్తమ్ అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. […]

ఒత్తిడి తట్టుకోలేక ప్రకృతి వైద్యానికి ఉత్తమ్
X

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రశాంతతను వెతుక్కునే పనిలో ఉన్నారు. వరుసగా ఎన్నికలు, రెండు సార్లు భార్య ఓటమితో… ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ఆర్ధికంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నల్లగొండ ఎంపీగా గెలిచిన ఆయన తాను రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజూర్‌నగర్ నుంచి భార్యను గెలిపించుకోలేకపోయారు. 42వేల ఓట్ల భారీ తేడాతో కాంగ్రెస్ ఇక్కడ చిత్తయింది. పార్టీ పరంగానూ ఉత్తమ్ అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రకృతి వైద్యం కోసం బెంగళూరు వెళ్లారు.

బుధవారం నుంచి 10 రోజుల పాటు బెంగళూరులోని ఒక నేచర్‌కేర్‌ సెంటర్ లో ఉంటూ చికిత్స తీసుకోనున్నారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమే ఆయన అక్కడికి వెళ్లినట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

ఉత్తమ్ మరీ ఒత్తిడి పెరిగినప్పుడు ఇలా ప్రకృతి వైద్యం కోసం వెళ్తుంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

First Published:  30 Oct 2019 1:44 AM GMT
Next Story