Telugu Global
NEWS

నో... అన్న ప్రభుత్వం.... ఎస్‌.... అన్న హైకోర్టు

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు. విచారణలో భాగంగా… ఆర్టీసీ బకాయిలపై కౌంటర్‌ దాఖలు చేసింది ప్రభుత్వం. ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని అడ్వకేట్‌ జనరల్ కోర్టుకు తెలిపారు‌. దీంతో కోర్టు ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలే చేసింది. ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందంటూ మండిపడింది. అడ్వకేట్‌ జనరల్ వాదనలపై కూడా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఉప ఎన్నికకు 100 కోట్ల రూపాయల వరాలు ప్రకటించడం పై కేసీఆర్‌ […]

నో... అన్న ప్రభుత్వం.... ఎస్‌.... అన్న హైకోర్టు
X

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు.

విచారణలో భాగంగా… ఆర్టీసీ బకాయిలపై కౌంటర్‌ దాఖలు చేసింది ప్రభుత్వం. ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని అడ్వకేట్‌ జనరల్ కోర్టుకు తెలిపారు‌. దీంతో కోర్టు ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలే చేసింది. ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందంటూ మండిపడింది. అడ్వకేట్‌ జనరల్ వాదనలపై కూడా హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

ఉప ఎన్నికకు 100 కోట్ల రూపాయల వరాలు ప్రకటించడం పై కేసీఆర్‌ ప్రభుత్వంపై సెటైర్లు వేసింది హైకోర్టు . ఈ ప్రభుత్వానికి ఒక్క నియోజకవర్గం ముఖ్యమా? రాష్ట్ర ప్రజలు ముఖ్యమా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 100 కోట్ల వరాలు ఇచ్చినవారు 47 కోట్లు ఇవ్వలేరా అంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది కోర్టు.

75 శాతం బస్సులు తిరుగుతున్నాయని ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు తెలపడంతో…. కోర్టు ఘాటుగా స్పందించింది.
బస్సులు తిరిగితే విద్యాసంస్థలకు దసరా సెలవులను ఎందుకు పొడిగించారని ప్రశ్నించింది. ఇప్పటికీ మూడోవంతు బస్సులు కూడా నడవడం లేదంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీలో అసలు మొత్తం ఎన్ని బస్సులు ఉన్నాయి…. ఇప్పుడు ఎన్ని తిరుగుతున్నాయో చెప్పాలంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.

ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మండిపడింది. విచారణకు ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ ఒక్కసారైనా హజరయ్యారా? అని ప్రశ్నించింది.

ఆర్టీసీ బకాయిలపై కౌంటర్‌ దాఖలు చేసిన అడ్వకేట్‌ జనరల్‌…. విభజన తర్వాత ఆస్తుల పంపకాలు జరగలేదని కోర్టుకు తెలిపారు. దీంతో ఆర్టీసీ ఆస్తుల పంపకాలు ఇంతవరకు ఎందుకు జరగలేదని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణకు ఆర్టీసీ ఫైనాన్స్‌ సెక్రటరీ, ఇన్‌చార్జి ఎండీ హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది హైకోర్టు.

బకాయిలపై ఎల్లుండిలోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

సమ్మె విరమించమని కార్మికుల్ని ఆదేశించలేమని హైకోర్టు తెలిపింది. సరూర్‌నగర్‌లో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సకలజనుల సమరభేరి సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ సమ్మెపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు.

First Published:  29 Oct 2019 5:56 AM GMT
Next Story