Telugu Global
Cinema & Entertainment

కొత్త సినిమా ప్రకటించిన కల్యాణ్ రామ్

వరుసగా ఫ్లాపులు చూసిన కల్యాణ్ రామ్ ను కాస్త ఒడ్డున పడేసిన మూవీ 118. సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అలా తనకు సక్సెస్ వచ్చింది కాబట్టి, ఆ సినిమాను నిర్మించిన మహేష్ కోనేరును సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడు కల్యాణ్ రామ్. అందుకే అతడి బ్యానర్ లో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అవును.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాతగా ఓ కొత్త సినిమా […]

కొత్త సినిమా ప్రకటించిన కల్యాణ్ రామ్
X

వరుసగా ఫ్లాపులు చూసిన కల్యాణ్ రామ్ ను కాస్త ఒడ్డున పడేసిన మూవీ 118. సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అలా తనకు సక్సెస్ వచ్చింది కాబట్టి, ఆ సినిమాను నిర్మించిన మహేష్ కోనేరును సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడు కల్యాణ్ రామ్. అందుకే అతడి బ్యానర్ లో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

అవును.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాతగా ఓ కొత్త సినిమా చేసేందుకు కల్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం చేస్తున్న ఎంత మంచివాడవురా సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఈ కొత్త సినిమా ప్రారంభమౌతుంది. 118 ను థ్రిల్లర్ జానర్ లో చేసిన కల్యాణ్ రామ్, ఈసారి మరో కొత్త స్టోరీలైన్ తో రాబోతున్నాడు

సినిమాకు సంబంధించి దర్శకుడు, హీరోయిన్ తో పాటు ఇతర టెక్నీషియన్స్ వివరాలేవీ వెల్లడించలేదు. ఎంత మంచివాడవురా సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ కొత్త సినిమా సంగతులు బయటకు రాబోతున్నాయి. 118 తరహాలోనే ఈసారి కూడా ఓ కొత్త దర్శకుడితో కలిసి కల్యాణ్ రామ్ సెట్స్ పైకి వెళ్లబోతున్నట్టు టాక్.

First Published:  29 Oct 2019 5:58 AM GMT
Next Story