Telugu Global
Cinema & Entertainment

క్రిస్మస్ బరిలో మరో మూవీ

ఎన్నో సినిమాలు అనుకున్నారు. కానీ చాలా సినిమాలు తప్పుకున్నాయి. కేవలం 2 మాత్రమే క్రిస్మస్ బరిలో మిగిలాయి. వాటిలో ఒకటి రూలర్ కాగా, రెండోది ప్రతిరోజూ పండగే. ఈ రెండు సినిమాలు డిసెంబర్ 20న వస్తున్నాయి. ఇక ఈ రెండు సినిమాల మధ్య మాత్రమే పోటీ అనుకుంటున్న టైమ్ లో కొత్తగా మరో సినిమా వచ్చి చేరింది. దాని పేరు ఇద్దరి లోకం ఒకటే. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పేరిది. దిల్ రాజు […]

క్రిస్మస్ బరిలో మరో మూవీ
X

ఎన్నో సినిమాలు అనుకున్నారు. కానీ చాలా సినిమాలు తప్పుకున్నాయి. కేవలం 2 మాత్రమే క్రిస్మస్ బరిలో మిగిలాయి. వాటిలో ఒకటి రూలర్ కాగా, రెండోది ప్రతిరోజూ పండగే. ఈ రెండు సినిమాలు డిసెంబర్ 20న వస్తున్నాయి. ఇక ఈ రెండు సినిమాల మధ్య మాత్రమే పోటీ అనుకుంటున్న టైమ్ లో కొత్తగా మరో సినిమా వచ్చి చేరింది. దాని పేరు ఇద్దరి లోకం ఒకటే.

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పేరిది. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. మంచి టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. పైగా రాజ్ తరుణ్ కు ఇప్పుడొక హిట్ అవసరం. అందుకే క్రిస్మస్ బరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. క్రిస్మస్ సెలవులతో పాటు జనవరి 1 హాలిడే కూడా కలిసొస్తుంది కాబట్టి 2 వీకెండ్స్ వరకు సినిమాకు తిరుగుండదనేది దిల్ రాజు ప్లాన్. రేపోమాపో అధికారిక ప్రకటన రాబోతోంది.

వరుసగా ఫ్లాపులు చూస్తున్న రాజ్ తరుణ్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. హీరోయిన్ గా నటిస్తున్న షాలినీ పాండే కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది. కృష్ణ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.

First Published:  29 Oct 2019 6:05 AM GMT
Next Story