Telugu Global
NEWS

యధావిధిగా భారత్-బంగ్లా తొలి టీ-20 మ్యాచ్

దీపావళి కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి ఢిల్లీని కమ్మేసిన కాలుష్య మేఘాలు భారత్- బంగ్లాదేశ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ లోని తొలిమ్యాచ్ యధావిధిగా న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ ( ఫిరోజ్ షా కోట్లా ) స్టేడియం వేదికగా జరుగుతుందని నిర్వాహక సంఘం ప్రకటించింది. ఇప్పటికే వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న న్యూఢిల్లీ మహానగర పరిస్థితిని…దీపావళి బాణసంచా కాలుష్యం మరింత ప్రమాదకరంగా మార్చింది. కాలుష్యనియంత్రణ మండలి అంచనాల ప్రకారం..దీపావళి కాలుష్యంతో ఢిల్లీ నగరం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి జారిపోయింది. ఆక్సిజన్ లోపంతో ఊపిరితీసుకోడం కష్టమేనని […]

యధావిధిగా భారత్-బంగ్లా తొలి టీ-20 మ్యాచ్
X
  • దీపావళి కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
  • ఢిల్లీని కమ్మేసిన కాలుష్య మేఘాలు

భారత్- బంగ్లాదేశ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ లోని తొలిమ్యాచ్ యధావిధిగా న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ ( ఫిరోజ్ షా కోట్లా ) స్టేడియం వేదికగా జరుగుతుందని నిర్వాహక సంఘం ప్రకటించింది.

ఇప్పటికే వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న న్యూఢిల్లీ మహానగర పరిస్థితిని…దీపావళి బాణసంచా కాలుష్యం మరింత ప్రమాదకరంగా మార్చింది.

కాలుష్యనియంత్రణ మండలి అంచనాల ప్రకారం..దీపావళి కాలుష్యంతో ఢిల్లీ నగరం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి జారిపోయింది. ఆక్సిజన్ లోపంతో ఊపిరితీసుకోడం కష్టమేనని హెచ్చరించింది.

అయితే…ఢిల్లీ క్రికెట్ సంఘం మాత్రం…నవంబర్ 3న జైట్లీ స్టేడియం వేదికగా నిర్వహించే టీ-20 మ్యాచ్ కు తాము అనుమతి సంపాదించామని…గతంలో ప్రకటించిన విధంగానే భారత్-బంగ్లాజట్ల టీ-20 మ్యాచ్ జరిగితీరుతుందని ప్రకటించింది.

దీపావళి సందర్భంగా కాల్చిన బాణసంచా కాలుష్యంతో…ఢిల్లీ విశ్వవిద్యాలయం నార్త్ కాంపస్, పూసా, రోహిళీ పంజాబీ బాగ్, వజీర్ పూర్, జహంగీర్ పూర్, డీటీయు, బవానా ప్రాంతాలలో దట్టమైన కాలుష్య మేఘాలు ఆవరించి ఉన్నాయి.

టీ-20 మ్యాచ్ జరిగే రోజున వాతావరణం మెరుగుపడే అవకాశం ఉందని, కాలుష్య మేఘాలు సైతం తొలిగిపోగలవని భావిస్తున్నారు.

First Published:  28 Oct 2019 7:02 PM GMT
Next Story