Telugu Global
NEWS

బీసీసీఐ సొమ్ముతో ఐసీసీ సోకులు

ఐసీసీ పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడి గరంగరం బీసీసీఐ లేకుంటే ఐసీసీ లేదు – ఠాకూర్ ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు కమ్ బీసీసీఐని అంతర్జాతీయ క్రికెట్ మండలి చిన్నచూపు చూడటాన్ని…బోర్డు మాజీ చైర్మన్, కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తప్పుపట్టారు. ఐసీసీకి అందుతున్న నిధుల్లో బీసీసీఐ నుంచే 75 శాతం అందుతోందని…బీసీసీఐ లేకుంటే ఐసీసీకి మనుగడేలేదని అనురాగ్ ఠాకూర్ గుర్తు చేశారు. భారత క్రికెట్ నియంత్రణమండలిని పక్కన పెట్టి…మిగిలినదేశాల క్రికెట్ బోర్డులకు […]

బీసీసీఐ సొమ్ముతో ఐసీసీ సోకులు
X
  • ఐసీసీ పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడి గరంగరం
  • బీసీసీఐ లేకుంటే ఐసీసీ లేదు – ఠాకూర్

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు కమ్ బీసీసీఐని అంతర్జాతీయ క్రికెట్ మండలి చిన్నచూపు చూడటాన్ని…బోర్డు మాజీ చైర్మన్, కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తప్పుపట్టారు.

ఐసీసీకి అందుతున్న నిధుల్లో బీసీసీఐ నుంచే 75 శాతం అందుతోందని…బీసీసీఐ లేకుంటే ఐసీసీకి మనుగడేలేదని అనురాగ్ ఠాకూర్ గుర్తు చేశారు.

భారత క్రికెట్ నియంత్రణమండలిని పక్కన పెట్టి…మిగిలినదేశాల క్రికెట్ బోర్డులకు ఐసీసీ ప్రాధాన్యమివ్వటం, విధాననిర్ణయాలు తీసుకొనే కమిటీలో భారత్ కు చోటు లేకుండా చేయటం.. ఏమాత్రం సమర్ధనీయం కాదని తేల్చి చెప్పారు.

ఐసీసీ నుంచి భారత క్రికెట్ నియంత్రణమండలి వాటాగా రావాల్సిన బకాయిలే 350 మిలియన్ డాలర్ల వరకూ ఉందని బోర్డు ప్రస్తుత చైర్మన్ సౌరవ్ గంగూలీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ నుంచి బీసీసీఐకి వాటాగా రావాల్సిన బకాయిలను వసూలు చేయటానికి మాజీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ ను మించిన మొనగాడు మరొకరు లేరని బోర్డు కార్యవర్గ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మార్కెట్ గా ఉన్న భారత్ నుంచే ఐసీసీకి వేలకోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఇందులో భారత్ కు అందాల్సిన వాటాను గణనీయంగా తగ్గించి..ఆదాయం లేని దేశాల క్రికెట్ బోర్డులకు ఇవ్వాలని…ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ నేతృత్వంలోని కమిటీ భావిస్తోంది.

First Published:  28 Oct 2019 8:01 PM GMT
Next Story