Telugu Global
NEWS

మెక్సికన్ జీపీ విజేత లూయి హామిల్టన్

కెరియర్ లో 83వ టైటిల్ నెగ్గి హామిల్టన్ 2019 ఫార్ములావన్ సీజన్లో…ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, టీమ్ మెర్సిడెస్ స్టార్ రేసర్ లూయి హామిల్టన్ తన విజయపరంపర కొనసాగిస్తున్నాడు. చివరకు మెక్సికన్ గ్రాండ్ ప్రీ టైటిల్ ను సైతం సొంతం చేసుకోగలిగాడు. హోరాహోరీగా సాగిన చాంపియన్షిప్ రేస్ లో టీమ్ ఫెరారీకి చెందిన సెబాస్టియన్ వెట్టల్, సహ రేసర్ వాలెట్టరీ బొట్టాస్ ల నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న.. హామిల్టన్ తన ఆధిక్యాన్ని నిలుపుకోగలిగాడు. వెట్టల్ కు రెండు, బొట్టాస్ కు మూడు […]

మెక్సికన్ జీపీ విజేత లూయి హామిల్టన్
X
  • కెరియర్ లో 83వ టైటిల్ నెగ్గి హామిల్టన్

2019 ఫార్ములావన్ సీజన్లో…ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, టీమ్ మెర్సిడెస్ స్టార్ రేసర్ లూయి హామిల్టన్ తన విజయపరంపర కొనసాగిస్తున్నాడు. చివరకు మెక్సికన్ గ్రాండ్ ప్రీ టైటిల్ ను సైతం సొంతం చేసుకోగలిగాడు.

హోరాహోరీగా సాగిన చాంపియన్షిప్ రేస్ లో టీమ్ ఫెరారీకి చెందిన సెబాస్టియన్ వెట్టల్, సహ రేసర్ వాలెట్టరీ బొట్టాస్ ల నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న.. హామిల్టన్ తన ఆధిక్యాన్ని నిలుపుకోగలిగాడు.

వెట్టల్ కు రెండు, బొట్టాస్ కు మూడు స్థానాలు దక్కాయి. ప్రస్తుత సీజన్లో హామిల్టన్ కు ఇది 10వ టైటిల్ కాగా…కెరియర్ లో 83వ విజయం.అంతేకాదు.. మెక్సికన్ జీపీ టైటిల్ అందుకోడం ఇది రెండోసారి మాత్రమే.

వచ్చే వారం టెక్సాస్ లోని ఆస్టిన్ వేదికగా జరిగే అమెరికన్ గ్రాండ్ ప్రీ రేస్ లో హామిల్టన్ మరో 4పాయింట్లు సాధించగలిగితే..ఆరోసారి ప్రపంచ టైటిల్ అందుకోగలుగుతాడు.

First Published:  28 Oct 2019 12:13 AM GMT
Next Story