Telugu Global
International

భార్యతో కలిసి తనను తాను పేల్చేసుకున్న బాగ్దాదీ

ఐసీస్ ఉగ్రవాద అధినేత అబు బకర్ ఆల్ బాగ్దాదీ హతమయ్యాడు. అమెరికా దళాలు నిర్వహించిన ఆపరేషన్ సమయంలో బాగ్దాదీ ప్రాణాలు తీసుకున్నాడు. సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రాంతానికి సమీపంలోని ఒక గ్రామం వద్ద బాగ్దాదీపై అమెరికా దళాలు దాడి చేశాయి. ఎనిమిది అపాచీ హెలికాప్టర్లతో గ్రామం వైపు దూసుకొచ్చాయి. తొలుత అమెరికా దళాలు అబు సలామ్ అనే ఉగ్రవాది ఇంటిపై దాడి చేసి లొంగిపోవాల్సిందిగా హెచ్చరించాయి. అయితే సలామ్ లొంగిపోకుండా కాల్పులు ప్రారంభించాడు. దాంతో అమెరికా దళాలు అపాచీ […]

భార్యతో కలిసి తనను తాను పేల్చేసుకున్న బాగ్దాదీ
X

ఐసీస్ ఉగ్రవాద అధినేత అబు బకర్ ఆల్ బాగ్దాదీ హతమయ్యాడు. అమెరికా దళాలు నిర్వహించిన ఆపరేషన్ సమయంలో బాగ్దాదీ ప్రాణాలు తీసుకున్నాడు. సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రాంతానికి సమీపంలోని ఒక గ్రామం వద్ద బాగ్దాదీపై అమెరికా దళాలు దాడి చేశాయి. ఎనిమిది అపాచీ హెలికాప్టర్లతో గ్రామం వైపు దూసుకొచ్చాయి.

తొలుత అమెరికా దళాలు అబు సలామ్ అనే ఉగ్రవాది ఇంటిపై దాడి చేసి లొంగిపోవాల్సిందిగా హెచ్చరించాయి. అయితే సలామ్ లొంగిపోకుండా కాల్పులు ప్రారంభించాడు. దాంతో అమెరికా దళాలు అపాచీ హెలికాప్టర్ల ద్వారా కాల్పులు జరిపి ఉగ్రవాదులను హతమార్చాయి.

అమెరికా దళాల దాడిలో బాగ్దాద్ ఇల్లు ధ్వంసమైంది. బగ్దాదీ మృతిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో బాగ్దాదీ చనిపోయాడని… అయితే అతడిని నేరుగా అమెరికా దళాలు హతమార్చలేదని వివరించారు.

అమెరికా బలగాలు చుట్టు ముట్టగానే బాగ్దాదీ భయంతో తనను తాను పేల్చేసుకున్నాడని ట్రంప్ వివరించారు. ఐసీస్ చీఫ్ ఒక పిరికివాడిలా ప్రాణాలు తీసుకున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా బలగాలు సమీపంలోకి రాగానే బాగ్దాదీ, అతడి భార్య పేలుడు పదార్ధాలు తమ శరీరాలకు చుట్టుకుని పేల్చేసుకున్నారు. ఆ ఘటనలో బగ్దాదీ ముగ్గురు పిల్లలు కూడా చనిపోయారు.

First Published:  27 Oct 2019 8:50 PM GMT
Next Story