Telugu Global
NEWS

వైసీపీని వీడే యోచనలో దగ్గుబాటి

ప్రకాశం జిల్లా పర్చూరు వైసీపీ ఇన్‌చార్జ్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఎన్నికల ముందు టీడీపీలోకి వెళ్లిన రామనాథం బాబును తిరిగి వైసీపీలోకి చేర్చుకోవడంతో దగ్గుబాటి వర్గం గుర్రుగా ఉంది. పురేందశ్వరి బీజేపీలో ఉంటూ వైసీపీపై విమర్శలు చేయడం, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉండడం సరికాదన్న అభిప్రాయం వైసీపీలో ఉంది. కుటుంబం మొత్తం ఒకే పార్టీలో ఉంటేనే కేడర్‌కు సరైన సంకేతాలు వెళ్తాయన్న వైసీపీ నాయకుల అభిప్రాయం… దగ్గుబాటి […]

వైసీపీని వీడే యోచనలో దగ్గుబాటి
X

ప్రకాశం జిల్లా పర్చూరు వైసీపీ ఇన్‌చార్జ్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఎన్నికల ముందు టీడీపీలోకి వెళ్లిన రామనాథం బాబును తిరిగి వైసీపీలోకి చేర్చుకోవడంతో దగ్గుబాటి వర్గం గుర్రుగా ఉంది.

పురేందశ్వరి బీజేపీలో ఉంటూ వైసీపీపై విమర్శలు చేయడం, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉండడం సరికాదన్న అభిప్రాయం వైసీపీలో ఉంది. కుటుంబం మొత్తం ఒకే పార్టీలో ఉంటేనే కేడర్‌కు సరైన సంకేతాలు వెళ్తాయన్న వైసీపీ నాయకుల అభిప్రాయం… దగ్గుబాటి కుటుంబంపై ఉంది. అయితే దగ్గుబాటి కుటుంబం మాత్రం రెండు పార్టీల్లోనూ ఉండాలని భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే రామనాథం బాబు వైసీపీలోకి రావడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వర్గం అసంతృప్తితో ఉంది. దగ్గుబాటి అనుచరులు పర్చూరులో సమావేశం అయ్యారు. దగ్గుబాటి కుటుంబం మొత్తం ఒకే పార్టీలో ఉండాలన్న ఒత్తిడి సరి కాదని వారు విమర్శించారు.

ఒకవేళ దగ్గుబాటి ఇన్‌చార్జ్‌ పదవి నుంచి తప్పుకుంటే ఆయన స్థానంలో రామనాథంను మాత్రం నియమించకూడదని దగ్గుబాటి అనుచరులు డిమాండ్ చేశారు. అయితే కొత్త ఇన్‌చార్జ్‌గా దగ్గుబాటి హితేష్‌ను నియమించాలని కొందరు… గొట్టి పాటి భరత్‌ను నియమించాలని మరికొందరు సమావేశంలో వాదించడం విశేషం. దాంతో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలనుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. హితేష్‌ కూడా వైసీపీకి రాజీనామా చేసి కొద్దికాలం మౌనంగా ఉండాలనుకుంటున్నారని చెబుతున్నారు.

First Published:  26 Oct 2019 10:24 PM GMT
Next Story