Telugu Global
Cinema & Entertainment

అదే హుందాతనం.... సరిలేరు నీకెవ్వరు

సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ ను సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ను దృష్టిలో పెట్టుకొని పెట్టారు. కానీ ఈరోజు రిలీజైన ఫస్ట్ లుక్ చూస్తే.. విజయశాంతిని దృష్టిలో పెట్టుకొని ఈ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. అవును.. సరిలేరు నీకెవ్వరు అనేంతలా విజయశాంతి ఫస్ట్ లుక్ ఉంది. ఆ ఠీవి, ఆ హుందాతనం… విజయశాంతి ఈజ్ బ్యాక్ అనిపించేలా ఉన్నాయి. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ఇలా ముఖానికి రంగేసుకుంది. ఈ సినిమాతో […]

అదే హుందాతనం.... సరిలేరు నీకెవ్వరు
X

సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ ను సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ను దృష్టిలో పెట్టుకొని పెట్టారు. కానీ ఈరోజు రిలీజైన ఫస్ట్ లుక్ చూస్తే.. విజయశాంతిని దృష్టిలో పెట్టుకొని ఈ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. అవును.. సరిలేరు నీకెవ్వరు అనేంతలా విజయశాంతి ఫస్ట్ లుక్ ఉంది. ఆ ఠీవి, ఆ హుందాతనం… విజయశాంతి ఈజ్ బ్యాక్ అనిపించేలా ఉన్నాయి.

దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ఇలా ముఖానికి రంగేసుకుంది. ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో బిజీ అవ్వాలనుకుంటోంది విజయశాంతి. రాజకీయ జీవితం సాఫీగా సాగకపోవడంతో, ఆమె ఇలా సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో భారతి అనే పాత్ర పోషిస్తోంది విజయశాంతి. ఈ సినిమాలో ఆమె లెక్చరర్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి ఇప్పటికే టాకీపార్ట్ పూర్తయింది. పాటలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. నవంబర్ చివరి వారం నాటికి సినిమాను పూర్తిచేసి, జనవరి 12న మూవీని థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్. అన్నట్టు ఇదే సినిమాతో బండ్ల గణేశ్ కూడా నటుడిగా రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

First Published:  26 Oct 2019 3:31 AM GMT
Next Story