Telugu Global
NEWS

ఆర్టీసీ చర్చలు విఫలం... సమ్మె యథాతథం, లోపల హైడ్రామా

తెలంగాణ ఆర్టీసీ యూనియన్ నాయకులతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఏ అంశంపైనా ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని యూనియన్ నాయకులు ప్రకటించారు. ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిర్బంధ చర్చలు జరిపారని అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. తాము లోపలికి వెళ్లగానే సెల్‌ఫోన్లు లాక్కున్నారన్నారు. అన్ని డిమాండ్లపైనా చర్చ జరగాలని తాము కోరగా… అందుకు యాజమాన్యం తరపు అధికారులు అంగీకరించలేదన్నారు. కోర్టు ఆదేశాలను కూడా యాజమాన్యం వక్రీకరిస్తోందన్నారు. 26 అంశాలపై చర్చ జరపాలని […]

ఆర్టీసీ చర్చలు విఫలం... సమ్మె యథాతథం, లోపల హైడ్రామా
X

తెలంగాణ ఆర్టీసీ యూనియన్ నాయకులతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఏ అంశంపైనా ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని యూనియన్ నాయకులు ప్రకటించారు.

ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిర్బంధ చర్చలు జరిపారని అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. తాము లోపలికి వెళ్లగానే సెల్‌ఫోన్లు లాక్కున్నారన్నారు. అన్ని డిమాండ్లపైనా చర్చ జరగాలని తాము కోరగా… అందుకు యాజమాన్యం తరపు అధికారులు అంగీకరించలేదన్నారు. కోర్టు ఆదేశాలను కూడా యాజమాన్యం వక్రీకరిస్తోందన్నారు.

26 అంశాలపై చర్చ జరపాలని తాము కోరగా… లేదు కొన్నింటిపైనే చర్చలు ఉంటాయంటూ వారే ఎజెండాను చర్చల్లో ముందుంచారన్నారు. దాంతో అసలు ఏ డిమాండ్‌ పైనా చర్చే జరగలేదన్నారు. మిగిలిన యూనియన్ నాయకులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తాము బయటకు వచ్చామన్నారు. మరోసారి చర్చలకు వస్తామని చెప్పి వచ్చామన్నారు.

చర్చలను వీడియో రికార్డు చేశారని… ఆ వీడియోను బయట పెడితే ఈ రోజు చర్చల్లో ఎవరి ఉద్దేశం ఎలా ఉందో తెలుస్తుందని అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు.

చర్చల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు తమకు భయాన్ని కలిగించిందన్నారు యూనియన్ నాయకుడు రాజిరెడ్డి. పోలీసులను పెట్టి సెల్‌ఫోన్లు కూడా తీసుకుపోకుండా అడ్డుకున్నారన్నారు. చర్చల్లో తాము చెప్పిన దానిపైనే చర్చలు జరపాల్సి ఉంటుందని యాజమాన్యం ప్రతినిధులు తేల్చిచెప్పారన్నారు. కనీసం డిమాండ్లను వినేందుకు కూడా వారు అంగీకరించలేదన్నారు. సమ్మె కొనసాగిస్తామని రాజి రెడ్డి ప్రకటించారు.

సమావేశంలో ఫోన్ల ద్వారా ఇతర నాయకులతో చర్చించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని మరో కార్మిక నాయకుడు వాసుదేవరావు విమర్శించారు. సమస్యను పరిష్కరించే ఉద్దేశం యాజమాన్యానికి ఉన్నట్టు కనిపించడం లేదన్నారు. కేవలం కోర్టు ఆదేశించినందుకే యాజమాన్యం చర్చలకు పిలిచినట్టుగా ఉందని వాసుదేవరావు అభిప్రాయపడ్డారు.

యాజమాన్యం తరపున వచ్చిన అధికారులే చర్చలను బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారని…. ఇలా జరగడం ఇదే తొలిసారి అని అశ్వత్థామరెడ్డి అన్నారు. అసలు చర్చలకు వచ్చిన ఇద్దరు అధికారులకు ఈ అంశంపై ఎలాంటి అవగాహన లేదన్నారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లను బయటపెట్టి… అవగాహన లేని ఇద్దరు ఐఏఎస్‌లు చర్చల్లో కూర్చున్నారని అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు.

First Published:  26 Oct 2019 6:34 AM GMT
Next Story