Telugu Global
NEWS

సుజనాతో కరణం బలరాం విందు భేటీ

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలే లైట్‌ తీసుకున్నారు. ఇసుక కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నిరసనలకు చంద్రబాబు పిలుపునివ్వగా… ప్రకాశం జిల్లా నేతలు మాత్రం స్పందించలేదు. జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా వారంతా ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. ఎమ్మెల్యేల దారిలోనే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పయణించారు. చంద్రబాబు ఆదేశాలకు ఏమాత్రం స్పందించలేదు. జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ కూడా జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమానికి ముఖం చాటేశారు. […]

సుజనాతో కరణం బలరాం విందు భేటీ
X

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలే లైట్‌ తీసుకున్నారు. ఇసుక కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నిరసనలకు చంద్రబాబు పిలుపునివ్వగా… ప్రకాశం జిల్లా నేతలు మాత్రం స్పందించలేదు. జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా వారంతా ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు.

ఎమ్మెల్యేల దారిలోనే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పయణించారు. చంద్రబాబు ఆదేశాలకు ఏమాత్రం స్పందించలేదు. జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ కూడా జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమానికి ముఖం చాటేశారు.

ఇక చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఏకంగా తన సొంత రాజకీయం చేసుకుంటున్నారు. చంద్రబాబు పిలుపునిచ్చినా నిరసన కార్యక్రమాలకు స్పందించని ఆయన… బీజేపీలోకి ఫిరాయించిన ఎంపీ సుజనాచౌదరితో విందు భేటీకి హాజరయ్యారు.

ఒంగోలులో ఒక టీడీపీ నేత ఇంట్లో సుజనా చౌదరి, కరణం బలరాం కలుసుకున్నారు. అక్కడే విందు భోజనం చేశారు. ఇద్దరూ ఏకాంతంగా సమావేశమై చర్చించారు. దాంతో బీజేపీలో ఉన్న సుజనాతో…. టీడీపీ ఎమ్మెల్యే బలరాం ఏం చర్చించారన్న దానిపై టీడీపీలో చర్చ జరుగుతోంది.

First Published:  26 Oct 2019 2:15 AM GMT
Next Story