Telugu Global
NEWS

జగన్ పై జేసీ ప్రేమ... కానీ ఎక్కడా తగ్గట్లేదు...

నెల్లూరు పెద్దా రెడ్డి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు… కానీ తాడిపత్రి పెద్దారెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఇప్పుడు ఆయన హవా అంతలా నడుస్తుంది. జగన్ అంటేనే సర్రుమని లేచే జేసీ బ్రదర్స్… ఇప్పుడు తమ రూటే సపరేటు అంటూ రూటు మార్చారు. జేసీ పొలిటికల్ బస్సు రూటు ఎందుకు మారినట్లు అన్న అనుమానాలు కలుగుతున్నాయి.. ఏపీ సీఎం జగన్ పాలనకు నూటికి నూటయాబై మార్కులు వేశారు జేసీ బ్రదర్స్. అయితే జగన్ మాత్రం తమ టార్గెట్ […]

జగన్ పై జేసీ ప్రేమ... కానీ ఎక్కడా తగ్గట్లేదు...
X

నెల్లూరు పెద్దా రెడ్డి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు… కానీ తాడిపత్రి పెద్దారెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఇప్పుడు ఆయన హవా అంతలా నడుస్తుంది. జగన్ అంటేనే సర్రుమని లేచే జేసీ బ్రదర్స్… ఇప్పుడు తమ రూటే సపరేటు అంటూ రూటు మార్చారు. జేసీ పొలిటికల్ బస్సు రూటు ఎందుకు మారినట్లు అన్న అనుమానాలు కలుగుతున్నాయి..

ఏపీ సీఎం జగన్ పాలనకు నూటికి నూటయాబై మార్కులు వేశారు జేసీ బ్రదర్స్. అయితే జగన్ మాత్రం తమ టార్గెట్ అని జేసీ అంటున్నారు. వరుసగా జేసీ ట్రావెల్స్ ను సీజ్ చేస్తుంది జగన్ ప్రభుత్వం. ఈ విషయం తెలుసుకున్న జేసీ బెంబేలెత్తిపోయి జగన్ రాగం ఎత్తుకున్నట్లు తెలుస్తోంది. జగన్ మావాడే అంటూ కోరస్ అందుకున్నాడు.

జేసీ దివాకర్ రెడ్డి హట్ కామెంట్స్ తో ఎప్పుడూ హెడ్ లైన్స్ లో ఉంటాడు. తాడిపత్రి నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అనంతపురం ఎంపీ గా పనిచేశాడు. ఇప్పటిదాకా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనంత ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి ఏకంగా జగన్ పై సెటైర్ల మీద సెటైర్లు విసిరేవాడు. ఎన్నికల ముందు ఆయన అధికారంలోకి వచ్చేంత సీను లేదని కామెంట్ చేశాడు. బంపర్ మెజారిటీతో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసి యూటర్న్ తీసుకున్నాడు. జగన్ మావాడు అంటూ ఫ్లేట్ ఫిరాయించాడు.

అయితే జగన్ మాత్రం అక్రమాలపై ఊరుకోలేదు. ఏపీ లోని అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ పై దాడులు మొదలయ్యాయి. దివాకర్ కు చెందిన 31 బస్సులకు సంబంధించి సరియైన రికార్డులు లేవని సీజ్ చేశారు.

ఇక్కడే జేసి ఓ ప్రశ్న వేస్తున్నాడు.. రాష్ట్రంలో చాలా ట్రావెల్స్ బస్సులు వుంటే మా బస్సులపైనే ఎందుకు ఫోకస్ పెట్టారని జేసి ప్రశ్న … అయితే జగన్ మావాడే అని అంటూనే బస్సు సీజ్ లను న్యాయపరంగా తేల్చుకుంటామని తెలిపాడు. జేసి దివాకర్ రెడ్డి నోటి దురుసు వలనే ఇదంతా జరుగుతుందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు.

ఇప్పుడు తాడిపత్రి పై క్రమక్రమంగా పెద్దారెడ్డి అధిపత్యం పెరుగుతోంది. జేసీ బ్రదర్స్ పట్టుకోల్పోతున్నారు. బస్సుల సీజ్ వలన ఆర్థికంగా, రాజకీయకంగా ఇబ్బందులు మొదలయ్యాయి జేసీ ఫ్యామిలీకి.

First Published:  26 Oct 2019 12:42 AM GMT
Next Story