Telugu Global
NEWS

కారు ఎంట్రీతో కాంగ్రెస్ కోటకు బీటలు... చరిత్రలో ఇది మూడోసారి...

అవి కాంగ్రెస్ కంచుకోటలు.. పోటీ అంటేనే ఇతర పార్టీ నేతలు వణికిపోయేవారు. కారు ఎంట్రీతో సీను మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు పోటీ అంటేనే కాంగ్రెస్ నేతలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఐదేళ్లలో అక్కడ మారిన రాజకీయ పరిస్థితులు ఏంటనేది ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఏడు సార్లు గెలిచిన జానారెడ్డి.. నాలుగు సార్లు గెలిచిన కోమటిరెడ్డి, ఐదు సార్లు గెలిచిన దామోదర్ రెడ్డి.. ఇక టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఫ్యామిలీకి భారీ షాక్. పాత నల్గొండ […]

కారు ఎంట్రీతో కాంగ్రెస్ కోటకు బీటలు... చరిత్రలో ఇది మూడోసారి...
X

అవి కాంగ్రెస్ కంచుకోటలు.. పోటీ అంటేనే ఇతర పార్టీ నేతలు వణికిపోయేవారు. కారు ఎంట్రీతో సీను మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు పోటీ అంటేనే కాంగ్రెస్ నేతలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఐదేళ్లలో అక్కడ మారిన రాజకీయ పరిస్థితులు ఏంటనేది ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

ఏడు సార్లు గెలిచిన జానారెడ్డి.. నాలుగు సార్లు గెలిచిన కోమటిరెడ్డి, ఐదు సార్లు గెలిచిన దామోదర్ రెడ్డి.. ఇక టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఫ్యామిలీకి భారీ షాక్.

పాత నల్గొండ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. ఇప్పుడు ఆ కోట బీటలు వారింది. రాజకీయంగా ఎదురులేని కాంగ్రెస్ నేతల నియోజకవర్గాలలో గులాబీజెండా ఎగిరింది. 2014లో ఆరు సీట్లలో గెలిచిన టీఆర్ఎస్ కు అప్పుడు బలమైన గులాబీ నాయకులు లేరు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికలనాటికి పరిస్ధితి మొత్తం మారిపోయింది. రాజకీయాలలో ఓటమి ఎరుగని నాయకులు కోమటిరెడ్డి, జానారెడ్డి, సూర్యపేటలో దామోదర్ రెడ్డి, పార్టీలో కీలక నేతలు అందరు నల్గొండలో గెలువలేకపోవడంతో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బతగిలింది.

పాత నల్గొండ జిల్లాలో 12 సీట్లలో మూడింట్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. వీరిలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ మారాడు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా హుజూర్ నగర్ ను కూడా కాంగ్రెస్ కోల్పోయింది.

దీంతో నల్గొండలో ప్రస్తుతం కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలు ఎవరూ లేకుండా పోయారు. అయితే జిల్లాలో రెండు ఎంపీ స్థానాలు మాత్రం కాంగ్రెస్ గెలిచింది. అయితే ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట రెడ్డి పార్టీ క్యాడర్ మీద ఆధారపడాల్సి వచ్చింది.

1980, 1994లో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో గెలవలేదు. కానీ ఆ తరువాత ఎలక్షన్స్ లో గెలిచారు. అయితే రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. వచ్చే ఎలక్షన్ల నాటికి బలపడుతామని కాంగ్రెస్ శ్రేణులు నమ్మకంగా ఉన్నారు.

First Published:  26 Oct 2019 2:10 AM GMT
Next Story