Telugu Global
NEWS

జగన్ ఓకే అంటే.... చంద్రబాబు పై సీబీఐ విచారణకు సిద్ధం...

ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరుకుంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై నిగ్గుతేలుస్తామని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తాజాగా హాట్ కామెంట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు వచ్చిన అమరావతి నిర్మాణం, పోలవరం, ఇతర అంశాలపై సీబీఐ దర్యాప్తును కోరితే ఖచ్చితంగా కేంద్రం ఈ అభ్యర్థనకు అనుగుణంగా విచారణ చేయిస్తుందని…. ఆయన హాట్ కామెంట్ చేశారు. ఈ విషయంలో తానే చొరవ […]

జగన్ ఓకే అంటే.... చంద్రబాబు పై సీబీఐ విచారణకు సిద్ధం...
X

ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరుకుంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై నిగ్గుతేలుస్తామని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తాజాగా హాట్ కామెంట్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు వచ్చిన అమరావతి నిర్మాణం, పోలవరం, ఇతర అంశాలపై సీబీఐ దర్యాప్తును కోరితే ఖచ్చితంగా కేంద్రం ఈ అభ్యర్థనకు అనుగుణంగా విచారణ చేయిస్తుందని…. ఆయన హాట్ కామెంట్ చేశారు.

ఈ విషయంలో తానే చొరవ తీసుకుంటానని.. సీబీఐ ఎంక్వైరీ జరిగేలా చూసుకుంటానని విష్ణువర్ధన్ రెడ్డి అనడం టీడీపీ నేతలను షాక్ కు గురిచేస్తోంది.

తాజాగా రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడిన విష్ణు ఈ మేరకు టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై జగన్ సర్కారు సీబీఐ విచారణ కోరాలని.. తానే ఈ విషయంలో చొరవ తీసుకుంటానని అనడం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.

ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు అమరావతి రాజధాని పూలింగ్ లో అక్రమాలు నిజమేనని విష్ణు చెప్పుకొచ్చాడు. ఇక పోలవరంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉండగా ఆరోపించిన జగన్ ఎందుకు అధికారంలోకి వచ్చాక దీనిపై సీబీఐ విచారణ కోరడం లేదో సమాధానం చెప్పాలని విష్ణు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో విస్తరించాలని, బాబును ఇరుకునపెట్టాలని చూసిన బీజేపీ…. ఇంతవరకు చంద్రబాబుపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రబాబును ఇరికించేలా చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

First Published:  26 Oct 2019 3:09 AM GMT
Next Story