Telugu Global
Cinema & Entertainment

'ఖైదీ' సినిమా రివ్యూ

రివ్యూ : ఖైదీ రేటింగ్ : 2.75/5 తారాగణం : కార్తీ, నరైన్, జార్జ్ మర్యన్, రమణ, దీన, వత్సన్ చక్రవర్తి, యోగి బాబు, మహానది శంకర్ తదితరులు సంగీతం :సామ్ సి ఎస్ నిర్మాతలు :ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు, తిరుపుర్ వివేక్ దర్శకత్వం : లోకేష్ కనగరాజ్ తెలుగు రాష్ట్రాల లో మంచి పేరున్న తమిళ హీరోలలో కార్తీ పేరు ముందే ఉంటుంది. కానీ గత కొంతకాలంగా కార్తీకి తెలుగులో ఒక […]

ఖైదీ సినిమా రివ్యూ
X

రివ్యూ : ఖైదీ
రేటింగ్ : 2.75/5
తారాగణం : కార్తీ, నరైన్, జార్జ్ మర్యన్, రమణ, దీన, వత్సన్ చక్రవర్తి, యోగి బాబు, మహానది శంకర్ తదితరులు
సంగీతం :సామ్ సి ఎస్
నిర్మాతలు :ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు, తిరుపుర్ వివేక్

దర్శకత్వం : లోకేష్ కనగరాజ్

తెలుగు రాష్ట్రాల లో మంచి పేరున్న తమిళ హీరోలలో కార్తీ పేరు ముందే ఉంటుంది. కానీ గత కొంతకాలంగా కార్తీకి తెలుగులో ఒక మంచి విజయం కూడా అందలేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కార్తి ఈ మధ్యనే ‘దేవ్’ సినిమాతో మరో ఫ్లాప్ ను చవి చూశాడు. తాజాగా ఇప్పుడు కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కైతి’ తమిళ సినిమాతో మన ముందుకొచ్చాడు. ఈ సినిమా తెలుగులో ‘ఖైదీ’ అనే టైటిల్ తో ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ గా విడుదలైన ఈ సినిమాపై అంచనాలు తక్కువ ఉన్నప్పటికీ కార్తీ ఈ సినిమాతో ఎలాగైనా ఒక మంచి హిట్ అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు.

సినిమా కథ మొత్తం కేవలం ఒకే ఒక్క రాత్రి లో జరుగుతుంది. దిల్లీ (కార్తి) ఒక పెద్ద పేరుమోసిన ఖైదీ. అతను తన కూతురు ని మొట్టమొదటి సారి చూడాలని తాపత్రయ పడుతూ ఉంటాడు. అదే ఆశతో ఒకరోజు రాత్రి దురదృష్టవశాత్తు పోలీసులు మరియు ఒక డ్రగ్ మాఫియా మధ్య జరుగుతున్న పోరులో దిల్లీ కూడా తెలియకుండానే ఇరుక్కుంటాడు. అసలు దిల్లీ ఎందుకు ఆ గొడవలో తలదూర్చాల్సి వచ్చింది? తరువాత దిల్లీ తన కూతుర్ని కలుసుకున్నాడా లేదా? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మిగతా సినిమాలతో పోలిస్తే కార్తీకి ఈ సినిమాలో ఛాలెంజింగ్ పాత్ర దక్కింది అని చెప్పుకోవాలి. తన అద్భుతమైన నటనతో తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. తన పాత్రకి ప్రాణం పోసిన కార్తి తను తప్ప ఆ పాత్ర ని ఎవరూ అంత బాగా చేయలేరు అన్నట్టుగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో, యాక్షన్ సన్నివేశాల్లో కార్తీ నటన సినిమాని నిలబెట్టిందని చెప్పుకోవచ్చు.

నరైన్ తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది . దీనా నటన చాలా బాగుంది. రమణ కూడా సినిమాలో చాలా బాగా నటించారు. వత్సన్ చక్రవర్తి నటన కూడా చాలా బాగుంది. యోగిబాబు కామెడీ సినిమాకి హైలైట్ గా చెప్పొచ్చు. మహానది శంకర్ కూడా చాలా బాగా నటించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సినిమాని అద్భుతంగా తెరకెక్కించడంలో లోకేష్ కనగరాజ్ తన ప్రతిభను చాటారు. సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యేవరకు ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టకుండా ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. సినిమాలోని ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఇస్తూ, కథని ప్రేక్షకుల మనసుకి హత్తుకునే విధంగా చూపించారు లోకేష్ కనగరాజ్. ముఖ్యంగా కార్తీ లోని నటుడిని పూర్తిస్థాయిలో బయటకు తీసిన దర్శకుడు లోకేష్ అని చెప్పవచ్చు. నెరేషన్ పరంగా కూడా లోకేష్ కనగరాజ్ కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మరియు వివేకానంద ఫిలిమ్స్ అందించిన నిర్మాణ విలువలు సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి. సామ్ సి ఏస్ సంగీతం సినిమాకి హైలైట్ గా మారింది. ముఖ్యంగా సామ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశం లోని ప్రతి ఎమోషన్ ని చాలా బాగా ఎలివేట్ చేసింది. సత్యన్ సూర్యన్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ఫీలోమిన్ రాజ్ ఎడిటింగ్ కూడా బాగుంది.

బలాలు:

కార్తీ, నేపధ్య సంగీతం, కథ, నెరేషన్

బలహీనతలు:

తమిళ నేటివిటి

చివరి మాట:

సినిమా గురించి మాట్లాడుకునే ముందు కథ గురించి చెప్పుకోవాలి. సినిమాకి అద్భుతమైన కథని అందించిన క్రెడిట్ మొత్తం దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి చెందుతుంది. అద్భుతమైన కథను ఎంపిక చేసుకున్న లోకేష్ తన కథలో అంతే అద్భుతమైన పాత్రలను కూడా తీర్చిదిద్దారు. ఆ పాత్రలో ఒదిగిపోయి నటీనటులు చాలా బాగా నటించారు. అందులో సినిమా మొత్తం కార్తీ తన భుజాలపై మోసుకు వెళ్లాడని చెప్పవచ్చు. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమాలో మొదటి 30 నిమిషాల్లోనే ప్రేక్షకులు కథలో లీనమైపోతారు. ఇంటర్వెల్ బ్లాక్ సినిమాలోకే హైలైట్ అని చెప్పొచ్చు.

సెకండ్ హాఫ్ లో కూడా కథను ఏ మాత్రం స్లో చేయకుండా చాలా బాగా నెరేట్ చేశారు. అయితే కొన్ని సన్నివేశాలు దళపతి మరికొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టినట్టు అనిపించినప్పటికీ లోకేష్ వాటిని తన స్టైల్ లో బాగానే చూపించారు. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకి ఆయువుపట్టుగా మారాయి. అయితే ఎంతైనా తమిళ సినిమా కాబట్టి ఆ ఫ్లేవర్ తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. అయితే ‘ఖైదీ’ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగల సత్తా ఉన్న ఒక మంచి థ్రిల్లర్.

First Published:  25 Oct 2019 4:48 AM GMT
Next Story