Telugu Global
NEWS

సీఎం కంటే బలవంతులుంటే గాడిన పెట్టాల్సిందే- రమణదీక్షితుల అంశంపై ఐవైఆర్

నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టీటీడీ ప్రధానార్చకుడిగా ఉన్న రమణదీక్షితులను చంద్రబాబు ప్రభుత్వం తప్పించింది. ఆ సమయంలో రమణదీక్షితులు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని ఆరోపించారు. తనపై వేటు పడిన తర్వాత జగన్‌మోహన్ రెడ్డిని కూడా రమణదీక్షితులు కలిశారు. వైసీపీ ప్రభుత్వం రాగానే తిరిగి ఆయన్ను నియమిస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు అలాంటి సూచనలేమీ కనిపించ లేదు. […]

సీఎం కంటే బలవంతులుంటే గాడిన పెట్టాల్సిందే- రమణదీక్షితుల అంశంపై ఐవైఆర్
X

నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టీటీడీ ప్రధానార్చకుడిగా ఉన్న రమణదీక్షితులను చంద్రబాబు ప్రభుత్వం తప్పించింది. ఆ సమయంలో రమణదీక్షితులు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని ఆరోపించారు.

తనపై వేటు పడిన తర్వాత జగన్‌మోహన్ రెడ్డిని కూడా రమణదీక్షితులు కలిశారు. వైసీపీ ప్రభుత్వం రాగానే తిరిగి ఆయన్ను నియమిస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు అలాంటి సూచనలేమీ కనిపించ లేదు.

ఈ నేపథ్యంలో మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు ట్విట్టర్‌లో స్పందించారు. అర్చకుల పట్ల జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూనే… రమణదీక్షితులు అంశాన్ని ప్రస్తావించారు. జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోందని… రెండు సార్లు టీటీడీ బోర్డు సమావేశాలు కూడా జరిగాయని… కానీ రమణ దీక్షితులు అంశంపై స్పష్టత లేదని వ్యాఖ్యానించారు.

గతంలో దీక్షితులు… జగన్‌ను కలిసినప్పుడు ఎల్లో మీడియా హేళన చేసిందని గుర్తు చేశారు. జగన్‌ బహిరంగంగానే ప్రధాన అర్చకుడికి పదవీ విరమణ ఉండదు అని ప్రకటించారని ఐవైఆర్‌ గుర్తు చేశారు.

వ్యవస్థలో కొందరు ముఖ్యమంత్రుల కంటే బలవంతులుగా ప్రవర్తిస్తున్నారా? అని ప్రశ్నించారు. అదే నిజమైతే వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రమణ దీక్షితుల పట్ల సీఎం సానుకూలంగా ఉన్నా మధ్యలో ఉన్న వారు అడ్డుపడుతున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

First Published:  24 Oct 2019 9:00 PM GMT
Next Story