Telugu Global
Cinema & Entertainment

ఇస్మార్ట్ గా ఇరగదీశాడు

రామ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ అయింది. ఈ ఒక్క సినిమా దెబ్బతో పూరి జగన్నాధ్, తన అప్పులన్నీ తీర్చేశాడు. కొత్త కారు కూడా కొనుక్కున్నాడు. అలా అందరి జీవితాల్ని సెటిల్ చేసిన ఈ సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి బుల్లితెరపై ఇస్మార్ట్ ప్రభంజనం కనిపించింది. అవును.. రేటింగ్స్ లో ఈ సినిమా దుమ్ముదులిపింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాను జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం చేశారు. […]

ఇస్మార్ట్ గా ఇరగదీశాడు
X

రామ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ అయింది. ఈ ఒక్క సినిమా దెబ్బతో పూరి జగన్నాధ్, తన అప్పులన్నీ తీర్చేశాడు. కొత్త కారు కూడా కొనుక్కున్నాడు. అలా అందరి జీవితాల్ని సెటిల్ చేసిన ఈ సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి బుల్లితెరపై ఇస్మార్ట్ ప్రభంజనం కనిపించింది. అవును.. రేటింగ్స్ లో ఈ సినిమా దుమ్ముదులిపింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాను జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం చేశారు. 13వ తేదీన టెలికాస్ట్ అయిన ఈ సినిమాకు ఏకంగా 16.63 (అర్బన్) టీఆర్పీ వచ్చింది. రేటింగ్స్ లో బార్క్ పద్ధతి అమల్లోకి వచ్చిన తర్వాత రామ్ సినిమాకు ఈ స్థాయిలో టీఆర్పీ రావడం ఇదే ప్రథమం. ఈ సినిమా దెబ్బకు వినయ వినయ విధేయ రామ కూడా చేతులెత్తేసింది.

రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాను అదే టైమ్ లో ఇస్మార్ట్ కు పోటీగా స్టార్ మా టీవీలో ప్రసారం చేశారు. కానీ రామ్ చరణ్ సినిమాకు కేవలం 7.8 టీఆర్పీ వచ్చింది. అలా ఇస్మార్ట్ శంకర్ సినిమా వినయ విధేయ రామపై పైచేయి సాధించింది. ఇక ఈ ఏడాది అత్యధిక టీఆర్పీలు సాధించిన సినిమాల లిస్ట్ ఇలా ఉంది

ఎఫ్ 2- 17.2
ఇస్మార్ట్ శంకర్ – 16.63
కాంచన 3 – 13.10
మహర్షి – 9.2
ఓ బేబీ – 9
జెర్సీ – 8.8
మజిలీ – 7.9

First Published:  24 Oct 2019 6:01 AM GMT
Next Story