Telugu Global
NEWS

భారత టీ-20 జట్టులో శివం దూబే, సంజు శాంసన్

టీ-20 జట్టుకు రోహిత్, టెస్ట్ జట్టుకు కొహ్లీ నాయకత్వం 2020 టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా బంగ్లాదేశ్ తో జరిగే తీన్మార్ సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు …డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కొహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో వైస్ కెప్టెన్ రోహిత్ యాక్టింగ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. నవంబర్ 3 నుంచి జరిగే టీ-20 సిరీస్ , ఆ తర్వాత జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు వేర్వేరు […]

భారత టీ-20 జట్టులో శివం దూబే, సంజు శాంసన్
X
  • టీ-20 జట్టుకు రోహిత్, టెస్ట్ జట్టుకు కొహ్లీ నాయకత్వం

2020 టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా బంగ్లాదేశ్ తో జరిగే తీన్మార్ సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు …డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు.

రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కొహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో వైస్ కెప్టెన్ రోహిత్ యాక్టింగ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

నవంబర్ 3 నుంచి జరిగే టీ-20 సిరీస్ , ఆ తర్వాత జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు వేర్వేరు జట్లను బీసీసీఐ ఎంపిక సంఘం ముంబైలో ప్రకటించింది.

సంజు శాంసన్ కు పిలుపు…

రోహిత్ శర్మ నాయకత్వంలోని టీ-20 జట్టులో తొలిసారిగా ముంబై యువఆల్ రౌండర్ శివం దూబేకు చోటు కల్పించారు. అంతేకాదు…నాలుగేళ్ల విరామం తర్వాత.. కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ కు మరో అవకాశమిచ్చారు.

జట్టులోని ఇతర ఆటగాళ్లలో శిఖర్ ధావన్, రాహుల్, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, కృణాల్ పాండ్యా, యజువేంద్ర చాహల్, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, శివం దూబే, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు.

టెస్ట్ సిరీస్ కు అదేజట్టు…

సౌతాఫ్రికాతో ముగిసిన తీన్మార్ టెస్ట్ సిరీస్ లో క్లీన్ స్వీప్ విజయం సాధించిన భారతజట్టునే…బంగ్లాతో జరిగే రెండుమ్యాచ్ ల సిరీస్ లోనూ కొనసాగించాలని ఎంపిక సంఘం నిర్ణయించింది.

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని 15 మంది సభ్యుల జట్టే…రెండుమ్యాచ్ ల సిరీస్ లో సైతం బరిలోకి దిగనుంది. టెస్టు జట్టులో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, వృద్ధిమాన్ సాహా, రిషభ్ పంత్, హనుమ విహారీ, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, ఇశాంత్ శర్మ,శుభమాన్ గిల్ ఉన్నారు.

టెస్ట్ సిరీస్ నవంబర్ 14న ప్రారంభంకానుంది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భారత్ ఇప్పటి వరకూ ఆడిన ఐదుకు ఐదు టెస్టులూ నెగ్గి 240 పాయింట్లతో లీగ్ టేబుల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

First Published:  24 Oct 2019 10:07 AM GMT
Next Story