Telugu Global
NEWS

106వ ర్యాంక్ లో భారత ఫుట్ బాల్ జట్టు

రెండుర్యాంకులు పడిపోయిన సునీల్ చెత్రీ సేన ప్రపంచ సాకర్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారతజట్టు 106 ర్యాంక్ కు పడిపోయింది. గత నెలలో 104వ ర్యాంక్ లో ఉన్న భారత జట్టు…తనకంటే 40 ర్యాంకులు దిగువన ఉన్న బంగ్లాదేశ్ తో ముగిసిన ప్రపంచకప్ అర్హత మ్యాచ్ ను 1-1తో డ్రాగా ముగించడం తో రెండు స్థానాల మేర ర్యాంక్ ను కోల్పోయింది. ప్రపంచ ఫుట్ బాల్ నంబర్ వన్ ర్యాంకును బెల్జియం నిలుపుకోగా… ఫ్రాన్స్ రెండు, బ్రెజిల్ మూడు […]

106వ ర్యాంక్ లో భారత ఫుట్ బాల్ జట్టు
X
  • రెండుర్యాంకులు పడిపోయిన సునీల్ చెత్రీ సేన

ప్రపంచ సాకర్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారతజట్టు 106 ర్యాంక్ కు పడిపోయింది. గత నెలలో 104వ ర్యాంక్ లో ఉన్న భారత జట్టు…తనకంటే 40 ర్యాంకులు దిగువన ఉన్న బంగ్లాదేశ్ తో ముగిసిన ప్రపంచకప్ అర్హత మ్యాచ్ ను 1-1తో డ్రాగా ముగించడం తో రెండు స్థానాల మేర ర్యాంక్ ను కోల్పోయింది.

ప్రపంచ ఫుట్ బాల్ నంబర్ వన్ ర్యాంకును బెల్జియం నిలుపుకోగా… ఫ్రాన్స్ రెండు, బ్రెజిల్ మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి.

టాప్ టెన్ ర్యాంకుల్లో నిలిచిన జట్లలో ఉరుగ్వే (5 ), క్రొయేషియా ( 7 ), అర్జెంటీనా (9), ఇంగ్లండ్ (4), పోర్చుగల్, స్పెయిన్, కొలంబియా ఉన్నాయి.

ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్యలో మొత్తం 204 దేశాలకు సభ్యత్వం ఉంది. జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్…ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ ర్యాంకింగ్స్ లో 106 వ స్థానం సాధించడం క్రీడాభిమానులను విస్మయానికి గురి చేస్తోంది.

First Published:  24 Oct 2019 10:00 AM GMT
Next Story