Telugu Global
NEWS

స్పిన్నర్ల అడ్డాలో సౌతాఫ్రికా స్పిన్నర్లకు చేదుఅనుభవం

టెస్ట్ సిరీస్ లో సఫారీ స్పిన్నర్ల అష్టకష్టాలు 3 ఇన్నింగ్స్ లో 1000 పరుగులిచ్చి 10 వికెట్లు టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ తో జరుగుతున్న మూడుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్… మొదటి రెండు టెస్టులు, మూడు ఇన్నింగ్స్ లోనే సౌతాఫ్రికా స్పిన్నర్లు తేలిపోయారు. స్పిన్నర్ల అడ్డా భారత గడ్డపై పరుగులు ధారాళంగా సమర్పించుకొంటూ అయోమయంలో చిక్కుకొన్నారు. విశాఖ పట్నం వేదికగా ముగిసిన తొలిటెస్టుతో పాటు పూణే టెస్ట్ తొలిఇన్నింగ్స్ వరకూ సఫారీ స్పిన్ త్రయం […]

స్పిన్నర్ల అడ్డాలో సౌతాఫ్రికా స్పిన్నర్లకు చేదుఅనుభవం
X
  • టెస్ట్ సిరీస్ లో సఫారీ స్పిన్నర్ల అష్టకష్టాలు
  • 3 ఇన్నింగ్స్ లో 1000 పరుగులిచ్చి 10 వికెట్లు

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ తో జరుగుతున్న మూడుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్… మొదటి రెండు టెస్టులు, మూడు ఇన్నింగ్స్ లోనే సౌతాఫ్రికా స్పిన్నర్లు తేలిపోయారు.

స్పిన్నర్ల అడ్డా భారత గడ్డపై పరుగులు ధారాళంగా సమర్పించుకొంటూ అయోమయంలో చిక్కుకొన్నారు.

విశాఖ పట్నం వేదికగా ముగిసిన తొలిటెస్టుతో పాటు పూణే టెస్ట్ తొలిఇన్నింగ్స్ వరకూ సఫారీ స్పిన్ త్రయం కేశవ్ మహారాజ్, సేనురన్ ముత్తుస్వామి, డేన్ పీట్ లను భారత టాపార్డర్ ఆటగాళ్లు ఓ ఆటాడుకొన్నారు.

భారత సంతతి స్పిన్నర్ల వెలవెల…

ప్రస్తుత సౌతాఫ్రికా టెస్టుజట్టులోని లెఫ్టామ్ స్పిన్ జోడీ కేశవ్ మహారాజ్, సేనురన్ ముత్తుస్వామి…భారత సంతతికి చెందిన బౌలర్లే కావడం విశేషం. ఆఫ్ స్పిన్నర్ డేన్ పీట్ మాత్రమే సౌతాఫ్రికా నల్లజాతి స్పిన్నర్ గా ఉన్నాడు.

టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన సౌతాఫ్రికా స్పిన్నర్ గా రికార్డు నెలకొల్పిన కేశవ్ మహారాజ్ మాత్రం… స్పిన్ ఫ్రెండ్లీ భారత వికెట్లపై వెలవెలపోయాడు.

స్పిన్ బౌలింగ్ ను అలవోకగా ఎదుర్కనే నేర్పుకలిగిన భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ , విరాట్ కొహ్లీ, అజంక్యా రహానే,రవీంద్ర జడేజాల ముందు మహారాజ్ స్పిన్ జాదూ ఏమాత్రం పనిచేయలేదు.

పూణే టెస్టులో 196 పరుగులకే 1 వికెట్..

పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగిన రెండోటెస్ట్ తొలిఇన్నింగ్స్ లో సఫారీ ప్రదాన స్పిన్నర్ కేశవ్ మహారాజ్..ఎండవేడిమి, ఉక్కబోత వాతావరణంలో 50 ఓవర్లు బౌల్ చేసి…196 పరుగులిచ్చి…రహానే వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు.

విశాఖ వేదికగా ముగిసిన తొలిటెస్టు రెండు ఇన్నింగ్స్ లో కలసి…77 ఓవర్లపాటు బౌల్ చేసి 300కు పైగా పరుగులిచ్చి 5 వికెట్లు మాత్రమే సాధించగలిగాడు.

ప్రస్తుత సిరీస్ మొదటి మూడు ఇన్నింగ్స్ లో 514 పరుగులు సమర్పించుకొన్నాడు.

ప్రతి 127 పరుగులకూ ఓ వికెట్టు పడగొట్టడం ద్వారా 85. 67 సగటు తో సరిపెట్టుకోక తప్పలేదు.

ఆఫ్ స్పిన్నర్ పీట్ ది అదే సీన్..

కేవలం విశాఖటెస్టుకు మాత్రమే పరిమితమైన ఆఫ్ స్పిన్నర్ డేన్ పీట్ 209 పరుగులిచ్చి 1 వికెట్ మాత్రమే సాధించాడు. మరోవైపు…భారత గడ్డపై టెస్ట్ అరంగేట్రం చేసిన సేనురన్ ముత్తుస్వామి మూడు ఇన్నింగ్స్ లో 180 పరుగులిచ్చి కొహ్లీ,రవీంద్ర జడేజా వికెట్లు పడగొట్టాడు.

పార్ట్ టైమ్ స్పిన్నర్లు డీన్ ఎల్గర్, మర్కారమ్ లతో కలసి..మొత్తం ఐదుగురు సఫారీ స్పిన్నర్లు కలసి మూడు ఇన్నింగ్స్ లో 940 పరుగులిచ్చి 10 వికెట్లు సాధించడం చూస్తే…ఎంత దారుణంగా విఫలమయ్యిందీ మరి చెప్పాల్సిన పనిలేదు.

First Published:  18 Oct 2019 8:15 PM GMT
Next Story