Telugu Global
National

కల్కి ఆశ్రమాల్లో కట్టలపాములు.. లేహ్యం రూపంలో డ్రగ్స్...?

కల్కి భగవాన్.. కలియుగ ప్రత్యక్షదైవం అంటూ కీర్తించుకుంటున్నాడు. ఆయనను ఆరాధించేవారు కోకొల్లలు. అందుకే కొద్దికాలంలోనే కల్కి భగవాన్ దేశంలో ఎలా అపర కుబేరుడిగా మారిపోయాడనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఏం సమాచారం అందిందో కానీ ఈ కల్కి ఆశ్రమాలపై దాడులు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా సోదాలు కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున ఐటి శాఖాధికారులు నోట్లకట్టలను, లేహ్యం రూపంలో ఉన్న […]

కల్కి ఆశ్రమాల్లో కట్టలపాములు.. లేహ్యం రూపంలో డ్రగ్స్...?
X

కల్కి భగవాన్.. కలియుగ ప్రత్యక్షదైవం అంటూ కీర్తించుకుంటున్నాడు. ఆయనను ఆరాధించేవారు కోకొల్లలు. అందుకే కొద్దికాలంలోనే కల్కి భగవాన్ దేశంలో ఎలా అపర కుబేరుడిగా మారిపోయాడనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఏం సమాచారం అందిందో కానీ ఈ కల్కి ఆశ్రమాలపై దాడులు మొదలయ్యాయి.

చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా సోదాలు కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున ఐటి శాఖాధికారులు నోట్లకట్టలను, లేహ్యం రూపంలో ఉన్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో ఐటీ అధికారులు వరుసగా మూడో రోజు శుక్రవారం సోదాలు నిర్వహస్తున్నారు. కల్కి ఆశ్రమంలో భారీ ఎత్తున నగదును, కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఆశ్రమం నుంచి బయటకు కొంత నగదును తరలించే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఐటి అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

హైదారాబాదు, చెన్నై, బెంగుళూరు లాంటి ప్రాంతాల్లో కల్కి భగవాన్ తనయుడు లోకేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించినట్టుగా ఐటీ శాఖాధికారులు గుర్తించారు. ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న లోకేష్ దాసాజీ, శ్రీనివాస్ లను కూడా వేరువేరుగా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కల్కి భగవాన్ నివాసం ఉన్న క్యాంపస్ 3 లో ఆదాయపన్ను శాఖాదికారులు సోదాలు చేశారు. కల్కి ఆశ్రమం పేరును తరుచూ ఎందుకు మారుస్తున్నారని కూడా ఐటి అదికారులు ప్రశ్నించినట్టుగా సమాచారం.

కల్కి ఆశ్రమం పేరుతో ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నవారి పేరుతో భూములు , నిధులు ఉన్నాయనే విషయం కూడా ఆదాయ పన్ను శాఖ గుర్తించినట్టు సమాచారం. అధికారులు ఆశ్రమంలోని కంప్యూటర్ నుండి హర్డ్ డిస్కులను ఇతర కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

మరోవైపు కల్కి భగవాన్ ఆశ్రమం నుండి విదేశాలకు నిధులను తరలిస్తున్నారని ప్రచారం నేపథ్యంలోనే ఐటీ అధికారులు దాడులు చేసినట్టు సమాచారం అందుతోంది.

First Published:  18 Oct 2019 4:08 AM GMT
Next Story