Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు టాప్-10లో చేరిన సైరా

ఓవర్సీస్ లో సైరా సినిమా పరువు నిలబడింది. బ్రేక్ ఈవెన్ అవ్వక అష్టకష్టాలు పడుతున్న ఈ సినిమా కనీసం టాప్-10లో కూడా చేరలేదేమో అని అంతా అనుమానించారు. కానీ ఎట్టకేలకు ఈ సినిమా ఓవర్సీస్ లో టాప్-10 క్లబ్ లోకి చేరింది. కానీ చిరంజీవి లాంటి స్టార్ కు, సైరాపై ఉన్న అంచనాలకు ఇది ఏమాత్రం సరిపోదు. టాప్ లో ఉన్న బాహుబలి-2, బాహుబలి-1 లాంటి సినిమాల్ని క్రాస్ చేయకపోయినా.. కనీసం రంగస్థలం, భరత్ అనే నేను […]

ఎట్టకేలకు టాప్-10లో చేరిన సైరా
X

ఓవర్సీస్ లో సైరా సినిమా పరువు నిలబడింది. బ్రేక్ ఈవెన్ అవ్వక అష్టకష్టాలు పడుతున్న ఈ సినిమా కనీసం టాప్-10లో కూడా చేరలేదేమో అని అంతా అనుమానించారు. కానీ ఎట్టకేలకు ఈ సినిమా ఓవర్సీస్ లో టాప్-10 క్లబ్ లోకి చేరింది. కానీ చిరంజీవి లాంటి స్టార్ కు, సైరాపై ఉన్న అంచనాలకు ఇది ఏమాత్రం సరిపోదు.

టాప్ లో ఉన్న బాహుబలి-2, బాహుబలి-1 లాంటి సినిమాల్ని క్రాస్ చేయకపోయినా.. కనీసం రంగస్థలం, భరత్ అనే నేను సినిమాల రేంజ్ కు చేరుకుంటుందని, తద్వారా టాప్-5లోకి ఎంటర్ అవుతుందని అంతా అంచనా వేశారు. కానీ సైరా సినిమాను ఓవర్సీస్ జనాలు పట్టించుకోలేదు. ఎందుకో ఈ సినిమాలో కంటెంట్ ను వాళ్లు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అలా తక్కువ వసూళ్లతో కొనసాగిన సైరా ఎట్టకేలకు టాప్-10లో మాత్రం చేరగలిగింది.

ప్రస్తుతానికి సైరా కంటే ముందు విజయ్ దేవరకొండ, నితిన్ సినిమాలున్నాయి. ఈ రెండు సినిమాల వసూళ్లను సైరా అధిగమించే అవకాశం మాత్రం కనిపిస్తోంది. అంతకుమించి ఇది పైకి ఎగబాకే పరిస్థితులు కనిపించడం లేదు. ఓవర్సీస్ లో లేటెస్ట్ టాప్-10 సినిమాల జాబితా ఇది

బాహుబలి 2 – $ 20,571,695
బాహుబలి -1 – $ 6,861,819
రంగస్థలం – $ 3,513,450
భరత్ అనే నేను – $ 3,416,451
సాహో – $ 3,233,611
శ్రీమంతుడు – $ 2,883,437
మహర్షి – $ 2,543,515
గీతగోవిందం – $ 2,465,367
అ..ఆ – $ 2,449,174
సైరా – $ 2,448,312

First Published:  13 Oct 2019 8:32 PM GMT
Next Story