Telugu Global
NEWS

ఉధృతమవుతున్న ఆర్టీసీ సమ్మె.... ఖమ్మం బంద్ సంపూర్ణం

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవ్వాల్టికి 10వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు మరికొన్ని డిమాండ్లు నెరవేర్చుకునేందుకు కార్మికులు సమ్మె చేస్తున్నారు. తొలుత ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలోనే ప్రారంభమైన సమ్మె.. ఇప్పుడు ఉధృత రూపం దాలుస్తోంది. విద్యార్థి, ప్రజా సంఘాలు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఓయూ విద్యార్థి జేఏసీ సమ్మెకు మద్దతుగా ఈరోజు బస్ భవన్ ను ముట్టడించింది. జేఏసీ నాయకులు బస్ భవన్ ముట్టడించాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో […]

ఉధృతమవుతున్న ఆర్టీసీ సమ్మె.... ఖమ్మం బంద్ సంపూర్ణం
X

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవ్వాల్టికి 10వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు మరికొన్ని డిమాండ్లు నెరవేర్చుకునేందుకు కార్మికులు సమ్మె చేస్తున్నారు. తొలుత ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలోనే ప్రారంభమైన సమ్మె.. ఇప్పుడు ఉధృత రూపం దాలుస్తోంది. విద్యార్థి, ప్రజా సంఘాలు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించాయి.

ఓయూ విద్యార్థి జేఏసీ సమ్మెకు మద్దతుగా ఈరోజు బస్ భవన్ ను ముట్టడించింది. జేఏసీ నాయకులు బస్ భవన్ ముట్టడించాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వారిని అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు అన్ని విపక్ష రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మకుల సమ్మెకు మద్దతు పలికారు.

మరోవైపు ఈ నెల 19న ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు పలు పార్టీలు మద్దతు పలికాయి. జనసేన పార్టీ ఈ బంద్ కు సంపూర్ణ మద్దతు ఇస్తోందని ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో వెల్లడించింది.

ఖమ్మం బంద్ సంపూర్ణం..

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసరెడ్డి మృతికి నిరసనగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఇవ్వాళ్టి ఉదయం నుంచే వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసేసి బంద్‌కు మద్దతు పలికారు.

సత్తుపల్లి డిపో, మణుగూరు డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. ఇల్లెందు పట్టణంలో ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. ఉమ్మడి జిల్లాలో బంద్‌కు ప్రజల నుంచి కూడా అనూహ్య మద్దతు లభించడంతో సంపూర్ణంగా కొనసాగుతోంది.

First Published:  14 Oct 2019 3:54 AM GMT
Next Story