Telugu Global
NEWS

100 కోట్ల అప్పుల్లో జగ్గారెడ్డి

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన ఆర్థిక పరిస్థితి గురించి కీలక విషయం చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి తానేమీ కూడబెట్టుకోలేదన్నారు. డబ్బులు లేకపోయినా కార్యకర్తలు, నాయకులు ఇచ్చే డబ్బుతోనే తాను రాజకీయం చేస్తున్నానని చెప్పారు. తన వద్ద భారీగా డబ్బులు ఉన్నాయని అంతా అనుకుంటారని కానీ వాస్తవం అది కాదన్నారు. అప్పులు తెచ్చే రాజకీయాలు, సేవా కార్యక్రమాలు చేస్తుంటానని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన జగ్గారెడ్డి… తనకు ప్రస్తుతం 100 కోట్ల వరకు […]

100 కోట్ల అప్పుల్లో జగ్గారెడ్డి
X

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన ఆర్థిక పరిస్థితి గురించి కీలక విషయం చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి తానేమీ కూడబెట్టుకోలేదన్నారు. డబ్బులు లేకపోయినా కార్యకర్తలు, నాయకులు ఇచ్చే డబ్బుతోనే తాను రాజకీయం చేస్తున్నానని చెప్పారు. తన వద్ద భారీగా డబ్బులు ఉన్నాయని అంతా అనుకుంటారని కానీ వాస్తవం అది కాదన్నారు. అప్పులు తెచ్చే రాజకీయాలు, సేవా కార్యక్రమాలు చేస్తుంటానని చెప్పారు.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన జగ్గారెడ్డి… తనకు ప్రస్తుతం 100 కోట్ల వరకు అప్పులున్నాయని చెప్పారు. అయినా సరే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటానని ప్రకటించారు. తనకు కావాల్సిన డబ్బును కార్యకర్తలు, నాయకులే ఇస్తారని చెప్పారు.

ఇటీవల నిర్వహించిన దసరా ఉత్సవాలకు కోటి రూపాయలు ఖర్చు చేశానన్నారు. సమావేశంలో పలువురు నేతలను వేదికపైకి పిలిచి వారి వద్ద ఎంతెంత డబ్బు అప్పుగా తీసుకున్నది వారితో చెప్పించారు జగ్గారెడ్డి.

First Published:  11 Oct 2019 7:12 PM GMT
Next Story