Telugu Global
National

రవిప్రకాశ్‌ అక్రమాస్తుల చిట్టా...

టీవీ9 బహిష్కృత సీఈవో రవిప్రకాశ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే టీవీ9 నిధులను అక్రమంగా తరలించిన కేసులో హైదరాబాద్‌ పోలీసులు రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు. రవిప్రకాశ్‌ రిమాండ్‌లో ఉండగానే మరో షాక్ తగిలింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి … రవిప్రకాశ్‌ అక్రమాలపై నేరుగా సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాశారు. రవిప్రకాశ్‌ అక్రమాలపై ఈడీ, సీబీఐ చేత దర్యాప్తుకు ఆదేశించాలని తన లేఖలో విజయసాయిరెడ్డి కోరారు. ఐదు పేజీల లేఖలో పలు కీలక […]

రవిప్రకాశ్‌ అక్రమాస్తుల చిట్టా...
X

టీవీ9 బహిష్కృత సీఈవో రవిప్రకాశ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే టీవీ9 నిధులను అక్రమంగా తరలించిన కేసులో హైదరాబాద్‌ పోలీసులు రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు. రవిప్రకాశ్‌ రిమాండ్‌లో ఉండగానే మరో షాక్ తగిలింది.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి … రవిప్రకాశ్‌ అక్రమాలపై నేరుగా సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాశారు. రవిప్రకాశ్‌ అక్రమాలపై ఈడీ, సీబీఐ చేత దర్యాప్తుకు ఆదేశించాలని తన లేఖలో విజయసాయిరెడ్డి కోరారు. ఐదు పేజీల లేఖలో పలు కీలక ఆధారాలను కూడా సుప్రీం కోర్టు దృష్టికి వైసీపీ ఎంపీ తీసుకెళ్లారు.

హవాలా మార్గంలో రవిప్రకాశ్‌ విదేశాలకు వందల కోట్లు తరలించి అక్కడ వాటిని ఎలా పెట్టుబడులుగా పెట్టారన్న దాన్ని వివరించారు. రవిప్రకాశ్‌ విదేశాల్లో భాగస్వామిగా ఉన్న కంపెనీల వివరాలను, బ్యాంకు అకౌంట్ల నెంబర్లను కూడా విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో పొందుపరిచారు. రవిప్రకాశ్‌ మీడియాను అడ్డుపెట్టుకుని పలువురిని బెదిరించి వందల కోట్లు సంపాదించారని… ఆ సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలించాలని వివరించారు.

రవిప్రకాశ్‌ ఫెమా, ఆర్బీఐ రెగ్యులేషన్స్‌, ఐటీ నిబంధనలను ఎలా ఉల్లంఘించాడో విజయసాయిరెడ్డి తన లేఖలో సీజేకు వివరించారు. ఇప్పటికే ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న మాంసం ఎగుమతి దారుడు మొయిన్ ఖురేషితో పాటు సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సానా సతీష్‌తో రవిప్రకాశ్‌కు సంబంధాలున్నాయని విజయసాయిరెడ్డి వెల్లడించారు. మొయిన్ ఖురేషి, సానా సతీష్, రవిప్రకాశ్‌ ముగ్గురూ కలిసి ఆ మధ్య నగల వ్యాపారి సుఖేష్ గుప్తను బెదిరించి అతడి ద్వారా హవాలా నేరాలకు పాల్పడ్డారని లేఖలో వెల్లడించారు విజయసాయిరెడ్డి.

ఉగాండాలో కంపాలా సిటీ కేబుల్‌లో రవిప్రకాశ్‌ , ఆయన భార్య దేవిక భారీగా వాటాలు కలిగి ఉన్న వివరాలను విజయసాయిరెడ్డి సీజేఐకు రాసిన లేఖలో పొందుపరిచారు. అలాగే మరిన్ని కంపెనీల్లో రవిప్రకాశ్‌, ఆయన భార్య దేవిక పాత్ర ఉన్నట్టు వివరించారు.

కెన్యాలోని సింబా మీడియా కెన్యా లిమిటెడ్‌లోనూ రవిప్రకాశ్‌ భారీగా వాటాలు కలిగి ఉన్నాడు. మరో కంపెనీ మీడియా ఎన్‌ఎక్స్‌టీ లిమిటెడ్‌ కంపెనీకి రవిప్రకాశ్‌ చైర్మన్‌గా ఉన్నాడు. ఆయన భార్య డైరెక్టర్‌గా ఉన్న వివరాలను కూడా విజయసాయిరెడ్డి బయటపెట్టారు.

న్యూజెర్సీలోని ఐకాస్ట్ ఇంటర్నేషన్‌కు రవిప్రకాశ్‌ డైరెక్టర్‌గా ఉన్నాడు. మాయ విజన్ అనే మరో కంపెనీలోనూ రవిప్రకాశ్‌ పెట్టుబడులు పెట్టారు. విదేశాల్లో రవిప్రకాశ్ పెట్టిన పెట్టుబడులతో పాటు విదేశాల్లో అతడి బ్యాంకు వివరాలను కూడా లేఖలో పొందుపరిచారు విజయ సాయి రెడ్డి.

ఉగాండాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్‌ బ్రాంచ్‌లో రవిప్రకాశ్‌కు కార్పొరేట్ అకౌంట్ ఉంది. అలాగే జాంబియాలో ఇండో జాంబియా బ్యాంకు లిమిటెడ్‌లో 0112030000355 నెంబర్‌లో కరెంట్ అకౌంట్‌ ఉన్నట్టు విజయసాయిరెడ్డి తన లేఖలో వివరించారు.

ఇలా విదేశాల్లో భారీగా పెట్టుబడులు ఉన్న రవిప్రకాశ్‌ ఆ విషయాలను ఎక్కడా కూడా ఐటీ రిటర్న్స్‌లో చూపించకుండా ఐటీ శాఖను కూడా మోసం చేశాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రవిప్రకాశ్‌ది వందల కోట్ల మనీలాండరింగ్‌ కాబట్టి దీనిపై ఈడీ, సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు.

సీజే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై రవిప్రకాశ్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. లేఖ రాసింది ప్రముఖ రాజకీయ పార్టీ ఎంపీ, ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కావడం, తన ఫిర్యాదుకు పలు ఆధారాలను కూడా జోడించిన నేపథ్యంలో…. ఈ ఫిర్యాదులోని అంశాలపై దర్యాప్తు చేయాల్సిందిగా ఈడీ, సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశించవచ్చు.

First Published:  7 Oct 2019 7:34 PM GMT
Next Story