Telugu Global
Cinema & Entertainment

దసరా వేదికగా సంక్రాంతి పోటీ

సంక్రాంతికి బరిలోకి రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మహేష్, అల్లు అర్జున్. ఆ దిశగానే వాళ్ల సినిమాలు శరవేగంగా ముస్తాబవుతున్నాయి కూడా. సంక్రాంతి కోసం సిద్ధమౌతున్న ఈ రెండు సినిమాలు ఇప్పుడు దసరా వేదికగా కూడా పోటీపడుతున్నాయి. పోటాపోటీగా పోస్టర్లు రిలీజ్ చేస్తున్నాయి Wishing you all a very Happy Dussehra #HappyDussehra #AlaVaikunthapurramuloo pic.twitter.com/4gr4bkshEI — Allu Arjun (@alluarjun) October 7, 2019 దసరా శుభాకాంక్షలంటూ బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశాడు మహేష్. […]

దసరా వేదికగా సంక్రాంతి పోటీ
X

సంక్రాంతికి బరిలోకి రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మహేష్, అల్లు అర్జున్. ఆ దిశగానే వాళ్ల సినిమాలు శరవేగంగా ముస్తాబవుతున్నాయి కూడా. సంక్రాంతి కోసం సిద్ధమౌతున్న ఈ రెండు సినిమాలు ఇప్పుడు దసరా వేదికగా కూడా పోటీపడుతున్నాయి. పోటాపోటీగా పోస్టర్లు రిలీజ్ చేస్తున్నాయి

దసరా శుభాకాంక్షలంటూ బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశాడు మహేష్. కొండారెడ్డి బురుజు దగ్గర కత్తిపట్టిన స్టిల్ ను రిలీజ్ చేశాడు. అచ్చం కర్నూలు కొండారెడ్డి బురుజులా కనిపిస్తున్నది సెట్. రామోజీ ఫిలింసిటీలో ఈ సెట్ వేశారు. ప్రస్తుతం అక్కడే కొంతభాగం షూటింగ్ అయింది. మహేష్ దుబాయ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత, 14 నుంచి మళ్లీ షూటింగ్ అక్కడే మొదలవుతుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమాకు పోటీగా బన్నీ కూడా ఓ స్టిల్ రిలీజ్ చేశాడు. మహేష్ కత్తి పట్టిన స్టిల్ రిలీజ్ చేస్తే, బన్నీ ఓ ఫైటింగ్ సీక్వెన్స్ లోని స్టిల్ ను విడుదల చేశాడు. ఇది మాస్, క్లాస్ మేళవింపుగా ఉంది.

ఇలా బన్నీ, మహేష్ ఇద్దరూ అటు అల వైకుంఠపురం, ఇటు సరిలేరు నీకెవ్వరు సినిమాలతో పోటీపడుతున్నారు. వీళ్ల పోటీ మధ్యలో బాలయ్య లాంటి హీరోలు కూడా చేరిపోయారు.

First Published:  8 Oct 2019 12:04 AM GMT
Next Story